ప్రభుదేవా ఒత్తిడిలేదు:నయనతార వివరణ
నయనతార మతం మార్పిడి వ్యవహారం వివాదంగా మారింది. ఆమె మతాన్ని తన కాబోయే భర్త ప్రభుదేవా ఒత్తిడితోనే చేసిందంటూ క్రిష్టియన్ సంఘాలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఆమె అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది. తాను మనస్ఫూర్తిగా మతం మార్చుకున్నానని ఇందులో ప్రభుదేవా ఒత్తిడి లేదని నటి నయనతార స్పష్టం చేసింది. ఆదివారం కొచ్చి నుంచి చెన్నైకి చేరుకుని ఆర్య సమాజ ఆలయంలో మతం మార్పుకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేశారు.శాస్త్రోక్తంగా హిందూ మతాన్ని స్వీకరించారు.
ఇక నయనతారను బలవంతంగా మతమార్పిడి చేయించారని, ఇందుకు ప్రభుదేవా కారకుడని కేరళ లోని క్రైస్తవ సంఘం ఆరోపించింది. ఆరాధన క్రైస్తవ సంఘం ప్రతినిధి ఇనియన్‌జాన్ ఈ విషయమై స్పందిస్తూ.. ప్రభుదేవా వివాహం చేసుకోవడం కోసం నయనతారను మతమార్పిడి చేయించిన విషయం ఆవేదనను కలుగజేస్తోంది. ప్రభుదేవా బలవంతపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడేలా చేశారు. దీన్ని కూడా ఓ నేరంగా పరిగణించాలి అని పేర్కొన్నారు. నయనతార, ప్రభుదేవా త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నారు. వీరి వివాహం ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











