నయనతారలో ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ అదే

By Srikanya

చెన్నై : తెరపై హీరోయిన్స్ పలికే చిలక పలుకులు వారి సొంత గొంతులోంచి వచ్చేవి కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే వారంతా ముంబై నుంచో,కేరళ నుంచో దిగుమతి అవుతూంటారు కాబట్టి...వారికి ఇక్కడ భాషపై పట్టు ఉండదు. అందానికి, నటనకి ప్రయారిటీ ఇస్తూ వేరే వారి చేత డబ్బింగ్ చెప్పిస్తూ దర్శక,నిర్మాతలు మ్యానేజ్ చేస్తూంటారు. కొంతకాలం అయ్యాక వారు భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్తే మురిసిపోతూంటారు. ఇప్పుడు నయనతార అదే రూటులో ప్రయాణిస్తోంది. ఆమె గొంతు త్వరలో మనం వినచ్చు. అయితే అది తమిళ సినిమా కోసమే. ఈ డబ్బింగ్ చెప్పడం అనేది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకుడు, నిర్మాత భావిస్తున్నారు. ఆమె గొంతు వినాలని కుర్రకారు థియోటర్స్ కి పరుగెట్టే అవకాసం ఉందిట. అందుకే ఈ విషయాన్ని సాధ్యమైనంత పబ్లిసిటీ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట.

'ఎన్కు తమిళ్‌ కొంజెమే తెర్యుం'.. ఇప్పుడున్న హీరోయిన్లందరూ ఈ మాటే చెబుతారు. భాష కొద్దో గొప్పో వచ్చినా.. కనీసం డబ్బింగ్‌ చెప్పేందుకు ఇతర భాష హీరోయిన్లు కృషి చేస్తారు. కానీ మన హీరోయిన్లు మాత్రం.. ఏకంగా డబ్బింగ్‌కు డుమ్మాకొట్టి.. నిర్మాతకు చుక్కలు చూపించడమే అలవాటుగా చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఇకనుంచి మినహాయింపు ఇస్తానంటోంది కేరళకుట్టి నయనతార. ఇకపై తన చిత్రాలకు తానే డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమంటోంది.

Nayantara on her own voice in 'Idhu Namma Aaalu'

చాలా గ్యాప్‌ తర్వాత శింబుతో 'ఇదు నమ్మ ఆలు'లో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఈ సినిమాకు మీరే డబ్బింగ్‌ చెప్పండ'ని దర్శకుడు నయనతారను కోరగా.. అంగీకరించిందట. ఈ చిత్రం ద్వారా శింబు తమ్ముడు కురళరసన్‌ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

దీనిగురించి పాండిరాజ్‌ ముచ్చటిస్తూ.. డబ్బింగ్‌ చెప్పమని నయన్‌ను అడిగాను. అయితే ప్రారంభంలో ఆమే ససేమిరా అంది. మీరు డబ్బింగ్‌ చెబితేనే చిత్రానికి మరింత బలం చేకూరుతుందని చెప్పటంతో ఒప్పుకున్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌కు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X