నయనతార పై స్టార్ డైరక్టర్ కేసు

దాంతో లింగు స్వామి గౌరవంగా ఆమెను పిలిచి అంత ఎమౌంట్ ఇచ్చుకోలేనని,లాభాలు వస్తే తర్వాత చూసుకుందామని రెమ్యునేషన్ తగ్గించుకోమని అడిగాడు. దానికామె అది తన ప్రజ్టేజి ఇష్యూగా ఫీలవుతున్నానని తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాంతో లింగు స్వామి అడ్వాన్స్ అయినా తిరిగి ఇవ్వమని అడగటం జరిగింది. అయితే దానికి నయనతార తెలివిగా నేను ఆ సినిమా కోసం సెప్టెంబర్ లో డేట్స్ ఇచ్చాను. లింగు స్వామి పర్శనల్ కారణాలతో వాటిని వృధా చేసుకున్నాడు. అప్పటికీ నేను చాలా ఓపికగా ఎవరికీ డేట్స్ ఇవ్వకుండా ఆగాను. దాంతో నా కెరీర్ ఆగింది. మరో ప్రక్క అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమంటున్నారు.ఇది అన్యాయం అంటోంది. అలాగే ఈ డైరక్టర్ బయిట రకరకాల రూమర్స్ నాపై ప్రచారం చేస్తున్నాడని వినవచ్చింది. అంతేగాక నన్ను గాక వేరే హీరోయిన్స్ ని ఎప్రోచ్ అవుతున్నాడని రూఢీగా తెలిసింది. ఈ స్ధితిలో అతను అడ్వాన్స్ ఒదులుకోవటమే ఉత్తమమని అంటోంది. అయితే లింగు స్వామి దానికి ఒప్పుకోక ఈ రోజు(శుక్రవారం) ఆమెపై నిర్మాతల మండలిలో కేసు వేసాడు.


Click it and Unblock the Notifications











