టీవీ ఛానెల్ లో కనపడి షాకిచ్చిన నయనతార
నేను కేవలం సినిమాల్లో నటిస్తాను అంతే...అంతవరకే నా భాద్యత. ప్రమోషన్ అంటూ టీవీ ఛానెల్స్ కూ, విజయయాత్రలంటూ రోడ్లు మీదకు నన్ను పిలవద్దు అంటూ నయనతార..నిర్మాతలకు ముందే కండీషన్ పెట్టి సినిమా కమిట్ అవుతుందనే సంగతి తెలిసిందే. అందుకే నయనతారని ఎప్పుడూ టీవీ ఛానెల్స్ లో చూడటం మనకు తటస్ధించదు. అయితే ఆమె తాజాగా కాఫీ విత్ అను అనే తమిళ పోగ్రాం కోసం ఓ టీవీ ఛానెల్ కు వచ్చింది. దాంతో అంతా షాకయ్యారు. అయితే ఆమె మాజీ హీరోయిన్ సుహాసిని కజిన్ నటి అనూహాసన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని వచ్చిందని తెలిసింది. అనూ కోసమే నయనతార ఈ ప్రోగ్రామ్‌ను అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఆమె తాజాగా నటించిన బాస్ ఎన్ గిర భాస్కరన్ ప్రమోషన్ కోసం ఆ చిత్ర హీరో ఆర్య, దర్శకుడు రాజేష్‌తో ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఇక ఈ టీవీ షో సూపర్ హిట్టయింది. అందులో ఆమె స్పాంటినియస్ గా సమాధానాలు ఇవ్వటం అందరికీ నచ్చేసింది. అలాగే తమిళం కూడా అద్బుతంగా మాట్లాడేసి చూసేవారిని ఆకట్టుకుంది. అయితే ఇదంతా తమిళ చిత్ర పరిశ్రమలో ఓ హాట్ టాపిక్ గా మారింది. ఏదైమైనా ప్రభుదేవాతో పెళ్ళి అన్నప్పుటినుంచీ ఆమెలో ఇలా కొత్త లక్షణాలు క్షణానికొకటి దర్శనమిస్తున్నాయి.


Click it and Unblock the Notifications