ఐపీఎస్‌గా మారిన నయనతార
చెన్నై: షాకైపోకండి...నయనతార ఐపీఎస్‌గా మారింది నిజజీవితంలో కాదు. ఓ సినిమాలో.. జయం రవికి జంటగా తొలిసారినటిస్తున్న 'తని ఒరువన్' చిత్రంలో ఆమె ఇలా ఐపీఎస్‌గా నటిస్తున్నారు. జయంరవి సోదరుడు జయంరాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
నయనతార ఇందులో యాక్షన్‌పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గుర్రంపై స్వారీ చేసే సన్నివేశాలను కూడా ఇటీవలే చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు వాస్తవికంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని రోజులపాటు గుర్రపుస్వారీ నేర్చుకుంది నయనతార.

అంతేకాదు.. రోజు షూటింగ్‌కు ముందు ఓ సారి రిహార్సల్ కూడా చేస్తోందట. ఖాకీ దుస్తుల్లో గుర్రంపై ఈ అమ్మడు స్వారీ చేసే దృశ్యాలు చిత్రయూనిట్‌నే ఆకర్షించాయట. ఇన్నిరోజులు వెండితెరపై అందాలను ఆరబోసిన నయనతార ఇప్పుడు యాక్షన్ బాట పట్టింది. మరి ప్రేక్షకులు ఏమేర ఆమెకు ఎర్రతివాచి పరుస్తారో వేచి చూడాలి అంటోంది కోలీవుడ్.


Click it and Unblock the Notifications











