రేటు పెంచితే గానీ నయనతార రూల్స్ మార్చుకోలేదు
డబ్బుకి కక్కుర్తి పడి..యాడ్స్ చేయను అంటూ కబుర్లు చెప్పిన నయనతార ఇప్పుడు మాట మార్చింది. మంచి ఆఫర్ రాగానే తాను పెట్టుకున్న రూల్స్ ను తానే అతిక్రిమించింది. తాజాగా ఆమె సౌత్ లో పేరున్న పోతీస్ సిల్స్ వారికి బ్రాండ్ అంబాడిసర్ గా ఉండటానికి కమిటైంది. వారు బాగా పెద్ద మొత్తం ఆఫర్ చేయటంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్ళుగా తను యాడ్స్ లో కనిపించకపోవటానికి కారణం..నయనతారని చూడ్డానికి కేవలం సినిమాకి వచ్చే చూడాలనే ఇమేజ్ ని క్రియేట్ చేయాలని ఆలోచనేనని చెప్పేది. ఇప్పుడామె స్టాటజీ మార్చినట్లుంది.
ఇక నయనతారనే పెద్ద ఎమౌంట్ ని రెమ్యునేషన్ గా ఇచ్చి ఒప్పించటానికి కారణం ఆ పోతీస్ సిల్స్ వారు ఇలా చెప్తున్నారు...నయనతార అంటేనే ఓ పెద్ద బ్రాండ్. నాలుగు దక్షిణాది బాషల్లో ఆమెను తెలియని వారు లేరు. అలాగే మాకు నాలుగు రాష్ట్రాల్లో షో రూమ్స్ ఉన్నాయి. ఆమె మా దీపావళి 2010 కలెక్షన్స్ ని మొదట ప్రమోట్ చేస్తుంది. మాకు ఫ్యామిలీ కష్టమర్లు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో పెరుగుతారని భావిస్తున్నాం అంటున్నారు. ఇక ఈ యాడ్ ని షూట్ చేసింది ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు. అతను తాజాగా రోబోకి పని చేసారు. ఇక దర్శకత్వం వహించింది..ఎల్.విజయ్. అతను శంకర్ శిష్యుడు.


Click it and Unblock the Notifications











