twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుదేవా, నయన్‌ ల పెళ్లి ముంబైలో

    By Srikanya
    |

    నయనతార త్వరలో పెళ్ళికూతురు అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే వారి పెళ్లి ఎక్కడ జరగనుందనే విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వారి వివాహం ముంబైలోనే జరుపుకోవటానికి ఫిక్సైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఒక తమిళ పత్రిక ఆదివారం కథనం ప్రచురించింది. మొదట వీరు కేరళలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తర్వాత హైదరాబాద్, చెన్నైలో అయితే బాగుంటుందని భావించారు. కేరళ, చెన్నై, హైదరాబాద్‌లో అయితే అభిమానుల తాకిడితో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని భావించి చివరకు ముంబైని వేదికగా ఎంచుకున్నారని ఆ పత్రిక పేర్కొంది.

    ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపింది. ప్రభుదేవా తన మొదటి భార్య రమలత్‌తో విడాకులు తీసుకోవడంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయింది. అలాగే నయనతార కూడా తన కమిట్ మెంట్స్ ని అన్నిటినీ పూర్తి చేసుకుని వివాహానికి రెడీ అవుతోంది. ఆమె చివరగా తెలుగులో చేసిన చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తైంది. బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామరాజ్యం చిత్రం ఆమె ఇప్పటివరకూ చేసిన వాటిలో చివరి చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ రాముడుగా కనిపించనున్నారు. ప్రభుదేవా కూడా హిందీలో ఓ చిత్రం డైరక్ట్ చేయటానకి సన్నాహాలు చే్స్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే ఆ చిత్రం తెలుగులో హిట్టైన విక్రమార్కుడుకి రీమేక్.

    English summary
    Nayantara-Prabhu Deva, who were planning to marry in Hyderabad, seems to have changed their wedding destination. The couple is reportedly planning to enter wedlock in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X