నయనతారతో తెగదెంపులు ఎందుకంటే...: ప్రభుదేవా
తన భార్యకు విడాకులు ఇచ్చిన ప్రభుదేవా అప్పట్లో నయనతారను వివాహం చేసుకుంటాడని అంతా బావించారు. నయనతార కూడా ఇక నేను సినిమాలు చేయను అని ప్రకటించింది. అయితే ఊహించని విధంగా మళ్లీ ఇద్దరూ ఎవరు పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. ఎవరికి వాళ్లే మళ్లీ కెరీర్ లు ప్రారంభించారు. దీనికి కారణం ఎవరికీ అంతుపట్టలేదు. ఈ ప్రేమ పక్షులు మధ్య ఏదో జరిగి ఉంటుందని అంతా భావించారు..రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్య్యాయి కానీ అసలు నిజం ఇద్దరూ పెదవి విప్పి చెప్పలేదు. అయితే తాజాగా ప్రభుదేవా తమిళ మీడియాతో ఈ విషయం క్లారిఫై చేసారు.
ప్రభుదేవా మాటల్లోనే...'నయనతార కోసం నా భార్యను వదులుకున్నా, పిల్లల్ని మాత్రం వదులుకోలేకపోయాను. అయితే అది నయనతారకు నచ్చలేదు. పిల్లల్ని చూడడానికి వీల్లేదని చెప్పింది. నా మనసు అందుకు అంగీకరించలేదు. అందుకే, పిల్లల కోసం ఆమెనే వదులుకున్నాను. ఇప్పటికీ నా పిల్లలతో హాయిగా వున్నాను' అని తేల్చి చెప్పాడు ప్రభుదేవా.
అలాగే ... నా లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలనే చాలా సార్లు అనుకొన్నాను. కానీ నా ఆలోచనలు వాటిని బయిటకు మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయి. నిజానికి ఆమెను నేను మరచిపోయాను అన్నారు. ఏ విషయమైనా బాహాటంగా మాట్లాడటం నయనతార పద్ధతి. వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెబుతున్న విషయాలు నన్ను బాధించవు. నేను దేవుణ్ని నమ్ముతాను. జరిగేదంతా దైవ అనుగ్రహం వల్లేనని భావిస్తున్నా. ఆయన నన్ను మంచి దారిలో తీసుకెళ్తున్నారు అన్నారు.
ఇక తన తాజా చిత్రం విక్రమ్ రాధోర్ బాలీవుడ్ లో మెగా హిట్ అవటం పట్ల సంతోషం వెల్లబుచ్చారు. సల్మాన్‌ఖాన్‌తో మరోసారి పని చేయాలనే ఆలోచన ఉందని ప్రభు తెలిపారు. త్వరలో తాను చేయబోయే తదుపరి చిత్రం వివరాలు ప్రకటిస్తాను అన్నారు. అయితే రీమేకా లేక కొత్త స్క్రిప్టు అన్నది నిర్ణయించుకోలేదని అన్నారు. ఓ ప్రెష్ ప్రేమకథ చేయాలని ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











