రాత్రిళ్ళు గుర్తుపట్టలేరనే ధైర్యంగా నయనతార...
రాత్రి పూట వెళ్తే ఎవరూ నన్ను పెద్దగా గుర్తుపట్టరు. అందుకే చాలా వరకు నేను రాత్రిపూట వెళ్ళడానికే నేను ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఇంతకీ రాత్రిళ్ళు జనాలు గుర్తుపట్టకుండా చూసుకుని నయనతార చేసే పనేమిటంటే...ధియోటర్స్ కి వెళ్ళి సినిమాలు చూడటం. ఈ విషయం ఆమె చెప్తూ...'నేను నటించిన అన్ని సినిమాలను తప్పకుండా చూస్తాను. అదీ థియేటర్‌కెళ్ళి', అలాగే నేను నటించిన ఏ సన్నివేశాలను ప్రేక్షకులు ఆస్వాదించి చూస్తున్నారన్న విషయాన్ని స్పష్టంగా గమనిస్తాను. అన్నట్టు సినిమాల్లో కామెడీ పార్ట్ ఉంటే నాకు చాలా ఇష్టం" అని అంటోంది నయనతార. ఇక సెకండ్ షోలకే వెళ్లటంలో మరో లాభం కూడా ఉంది...షూటింగ్ ల హడావిడి లేకుండా కాస్త తీరిగ్గా చూడొచ్చు అంది. ఇక ఈ కేరళ గుమ్మ హీరోయిన్ గా నటించిన చిత్రం 'నేనే అంబానీ' ఆడియో ఈ మధ్యనే రిలీజైంది.


Click it and Unblock the Notifications











