'రోబో' చిత్రంలో నయనతార కనిపించనుందా?
రజనీకాంత్ తాజా చిత్రం రోబో లో నయనతార ఓ ఐటం సాంగ్ లో కనపడనుందనే వార్త తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. శివాజీ చిత్రంలోనూ ఐటం సాంగ్ చేసిన ఆమెను సెంటిమెంట్ గా ఈ చిత్రంలోనూ పాట కోసం తీసుకున్నారని, ఆ పాట సినిమాలో హైలెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇది రూమరా లేక నిజమా అన్నది మాత్రం స్పష్టం కావటం లేదు. ఇక ఈ విషయమై తమళ ఛానెల్స్ లో రెండురోజుల క్రితం ఓ న్యూస్ ఐటం కూడా ప్రసారమైంది. ఇక రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న రోబో చిత్రం విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. ఈ చిత్రం కోసం రిలీజ్ చేసిన ట్రైలర్స్ హైప్ ని క్రియోట్ చేస్తున్నాయి.
నయనతార రోబో శంకర్ రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ జీన్స్ కన్నారావు nayantara kanna rao rajinikanth jeans aishwarya rai robo sivaji


Click it and Unblock the Notifications