నయనతారా..నువ్వే గ్రేట్
శింబుతో ప్రేమాయణం అంటూ ఓ సారి, బ్యాన్ అంటూ మరోసారి రేటు పెంచిందంటూ అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచే సెక్సీ స్టార్ నయనతార ఈ సారి మాత్రం మంచి రీజన్ తో ముందు కొచ్చింది. కష్టాల్లో ఉన్న సాటి మనుషులకు ఆలోచించకుండా సహాయం అందించటం అంతటా చర్చనీయాంశమై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నయనతార నటించిన పలు చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన వెంకట్ మాణిక్యం అనే వ్యక్తి ఈమధ్యన బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న నయనతార వెంటనే అపోలో ఆసుపత్రిలో ఆతని వైద్య చికిత్సలకు గాను మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంది.
అలాగే 'చంద్రముఖి', 'బిల్లా' చిత్రాలకు పనిచేసిన మరో ప్రొడక్షన్ మేనేజర్ కమలకన్నన్ ఇటీవల తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ విషయం తెలిసిన నయనతార అతని వైద్య చికిత్స కోసం రెండు లక్షల రూపాయలు పంపించింది. సమయానికి ఆమె చేసిన సహాయం ఆ కుటుంబాలను ప్రాణదానం చేసినట్లయింది. ఇవి అందరికి తెలిసినవి అయితే తెలియనవి, బయిటకు రానివి నయనతార చాలామందికి సహాయాలు చేసిందనేది టాక్.
ఇక ఆమెతో సహాయం పొందిన వారు నయనతార ఔదార్యాన్ని జీవతాంతం మరిచిపోమంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. తెరపై ఆస్తులు రాసేసే చాలా మంది హీరోల కన్నా, ప్రగల్భాలు పలికే హీరోయిన్స్ కన్నా నయనతార చాలా చాలా గొప్పదంటున్నారు.


Click it and Unblock the Notifications











