ఉపముఖ్యమంత్రి కొడుకుని రిజెక్టు చేసిన నయనతార
నయనతార తనకు నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందని మరోసారి రుజువైంది. తాజాగా ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిదితో నటించేందుకు నయనతార 'నో' అన్నట్లు తెలిసింది. తమిళంలో 'బాస్ ఎంగిరా బాస్కరన్' (బాస్ అంటే భాస్కరన్)తో ఈమెకు తాజా హిట్ అందించిన రాజేష్ ఈ మధ్య ఉదయనిదికి కొత్త స్క్రిప్ట్ వినిపించాడు. ఇది నచ్చిన ఉదయనిది ఈ కొత్త ప్రాజెక్ట్‌లో పనిచెయ్యడానికి ఆసక్తి కనబర్చాడు. అయితే, హీరోయిన్ విషయంలో ఇద్దరూ తర్జనభర్జన పడి చివరికి నయనతారనే కథానాయికగా పెట్టుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ నయన్ మాత్రం 'కరుణ' చూపక నో అన్నట్లు తెలిసింది. మరి రాజేష్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదని చెప్తున్నారు. ప్రభుదేవా ఏమన్నా రికమెండు చేస్తే వర్కవుట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











