నయనతార కొత్త చిత్రాలు ఒప్పుకోకపోవటానికి కారణం అదే
నయనతార తాజాగా ఏ సినిమాలు కమిట్ కావటం లేదని దానికి కారణం ఆమె త్వరలో చేసుకోబోయే వివాహమేనంటూ కన్నడ పరిశ్రమలో జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఆమె జోగయ్య అనే చిత్రాన్ని రిజెక్టు చేయటంతో ఈ టాక్ వచ్చింది.శివరాజకుమార్ వందవ చిత్రం అయిన జోగయ్యలో నటించేందుకు ఆమెకు కోటి రూపాయల రెమ్యునేషన్ ఆఫర్ చేసారు. మొదట ఓకే చేసిన ఈ భామ రీసెంట్ గా ఎగ్రిమెంట్ సమయంలో నో చెప్పేసింది. దానికి కారణం తను సినిమాలు తగ్గించుకుంటున్నానని చెప్పింది. అలాగే ఇప్పటికే ఒప్పుకున్న కన్నడ చిత్రం సూపర్, తమిళ చిత్రం బాస్ ఎన్గిర భాస్కరన్ తప్ప ఆమె చేతిలో ఏ చిత్రాలు లేవు. దాంతో ఆమె ప్రభుదేవా ని వివాహమాడబోతోందని,అందుకే అతను ఆమెను సినిమాలు పూర్తి చేసుకోమన్నాడని చెప్తున్నారు. ఇక నయనతార రిజెక్ట్ చేయటంతో జోగయ్య చిత్రం దర్శకుడు ప్రేమ్ చాలా నిరాశపడ్డారు. హీరోయిన్ ఎంపిక వల్లే తమ చిత్రం బాగా లేటయిందని, శివరాజ్ కుమార్ 49వ పుట్టిన రోజున ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన సమయంలో నయనతార హ్యాండివటం చాలా దురదృష్టమని వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications











