నోరు విప్పిన నయనతార
గత నాలుగు రోజులుగా నయనతార,ప్రభుదేవా రిలేషన్ పై రకరకాల వార్తలు గుప్పు మంటున్న సంగతి తెలిసిందే. ఆమె చిన్నాన్న,పిన్ని మీడియా ముందుకు వచ్చి తమ కూతురు నయనతారని ..ప్రభుదేవా మోసం చేసాడని ఆరోపణ చేసారు. మరో ప్రక్క ప్రభుదేవా..ఒక్కడే కాళహస్తి గుళ్లో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో నయనతార సినిమాల్లోకి మళ్లి వస్తున్న వాదన ఊపందుకుంది. అయితే దీనిపై నయనతార మీడియా ముందుకు రావటానికి ఆసక్తి చూపలేదు. అయితే ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి తన నిర్మాతలకు,అబిమానులకు ఊరట ఇచ్చింది. అది...''నా చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే'' అంటూ తమిళ మీడియాకు చెప్పింది. దాంతో ప్రభుదేవా సంగతేమో గానీ అంతా హ్యాపీ ఫీలయ్యారు.
ఇక 'శ్రీరామరాజ్యం' సమయంలో వచ్చిన అవకాశాలను ఆమె కాదన్నప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా నయనకు అవకాశాలిస్తున్నారు నిర్మాతలు, హీరోలు. ఇప్పటికే నాగార్జున సరసన ఆమె ఓ సినిమా కమిట్ అయ్యారు. తమిళంలో అజిత్ సరసన ఓ సినిమా చేయబోతున్నారని వార్త. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ చిత్రాలకు నయనతార కోటి నుంచి కోటిన్నరలోపు డిమాండ్ చేసి తీసుకుంటున్నారట. తమిళనాడులో బీభత్సం సృష్టించిన థానే తుపాను బాధితులకు తన వంతు సహాయంగా ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను స్వయంగా కలిసి ఐదు లక్షల రూపాయల చెక్కుని అందజేశారు నయనతార.


Click it and Unblock the Notifications











