బిల్లా కాంబో ఈజ్ బ్యాక్..నయన్ బికినీ అందాలు !
2007 లో విడుదలైన తమిళ చిత్రం బిల్లా ఓ సంచలనం. అజిత్ స్టైలిష్ పెర్ఫామెన్స్, నయనతార బికినీ అందాలు అభిమానులకు పిచ్చెక్కించాయి. స్టైలిష్ చిత్రాలకు బిల్లా చిత్రం ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. అజిత్, నయనతార జోడికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చాలా కాలం తరువాత ఈ జోడి మళ్ళీ జత కట్టనునట్లు అధికారికంగా ప్రకటించబడింది. శివ దర్శకత్వం వహిస్తున్న అజిత్ చిత్రం విశ్వాసంలో నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. నయన్ హీరోయిన్ గా ఎంపిక కావడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

విశ్వాసంలో కూడా నయన్ అందాలు
దర్శకుడు శివ విశ్వాసం చిత్రాన్ని ఎమోషనల్ యాక్షన్ ఫిలింగా తీర్చి దిద్దనున్నారు. అజిత్ కు నయన్ పర్ఫెక్ట్ జోడి అని అభావించడంతో ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. బిల్లా చిత్రంలో నయన్ బికినిలో మెరవడం సౌత్ లోనే ఓ సెన్సేషన్. నయన్ బికినీ అందాల గురించి సినీ అభిమానుల్లో అప్పట్లో తీవ్రమైన చర్చ జరిగింది. విశ్వాసం చిత్రంలో కూడా నయనతార గ్లామర్ షో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ప్రభాస్
అజిత్ పాత్రకు తెలుగులో ఎవరి సరిపోతారు అని భావిస్తున్న తరుణంలో ప్రభాస్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. ప్రభాస్ స్టైలింగ్ ఈ చిత్రంలో అభిమానులని మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ బెస్ట్ చిత్రాల్లో ఈ చిత్రం ఒకటిగా నిలిచింది.

నయన్ బాటలో అనుష్క బికినీ
తమిళంలో నయనతార అందాల ఆరబోతలో మెప్పిస్తే, తెలుగులో అనుష్క వెనకడుగు వేయలేదు. అనుష్క కూడా బికినిలో మెరిసి గ్లామర్ ప్రియులకు అందాల కనువిందు చేసింది.

మ్యాజిక్ రిపీట్ అవుతుందా
చాలా కాలం తరువాత నయనతార అజిత్ తో జోడి కడుతుండడంతో విశ్వాసం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అజిత్ తో కలసి దర్శకుడు శివ వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు. విశ్వాసంలో అజిత్ - నయన్ జంటని ఎలా చూపించబోతున్నాడనే చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











