పెళ్లి విషయమై నయనతార ఖండన ప్రకటన
ప్రభుదేవాతో ప్రేమవ్యవహారం బెడిసిందంటూ వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార మండిపడింది. తన ప్రియుడు ప్రభుదేవాతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, త్వరలోనే తమ పెళ్లి తేదీని వెల్లడిస్తానని ప్రకటించింది. ప్రభుదేవాతో గతంలో కన్నా ఇప్పుడే బంధం బలపడిందని స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా షూటింగ్‌లతో బిజీగా వుండడంతో ఆయన్ని కలుసుకునే వీలు కలగలేదని.. అంతే తప్ప తమ మధ్య కలతలు ఏర్పడ్డాయన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. తమ వివాహ విషయం అందరి నోళ్లలో నానడం తనకిష్టం లేదని, అందుకే అందరికీ సమాధానం చెప్పేలా త్వరలోనే కళ్యాణ ఘడియలను ప్రకటిస్తానని నయనతార వివరించింది. గతంలో కూడా తమపై ఇలాంటి రూమర్స్ పుట్టించవద్దని మీడియాను ఆమె కోరారు. ఇక నయనతార,ప్రభుదేవా త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా జరగిన ఓ సంఘటన వారిద్దరి మధ్యన ఎడబాటు కలిగించిందని, నయనతార ..ప్రభుదేవాని ఎవాయిడ్ చేస్తోందంటూ ఓ ఇంగ్లీష్ డైలీ వార్తను ప్రచురించింది.దాంతో ఈ రూమర్ ప్రారంభమైంది.
వారు ఇచ్చిన న్యూస్ ప్రకారం... కొన్ని రోజులుగా నయనతార కొచ్చిన్‌లో ఉంటున్నారు. అయితే ఇటీవల ప్రభుదేవా తన పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్లారట. కానీ ఈ విషయాన్ని నయనతార దగ్గర ఆయన దాచారట. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నట్లు ఆమెకు చెప్పారట ప్రభుదేవా. కానీ అసలు విషయం ఆ తర్వాత తెలుసుకున్న నయనతార వెంటనే ప్రభుదేవాకి ఫోన్ చేసి, విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న ఆ సినిమా లొకేషన్‌కు వస్తానన్నారట. అది ఊహించని ప్రభుదేవా కంగారుపడిపోయి నయనతారను ముంబయిలో ఉండమని చెప్పి, హుటాహుటిన తన పిల్లలను చెన్నయ్‌లో వదిలి ముంబయిలో వాలిపోయారట.ఈ సంఘటనకు చిర్రెత్తిన నయనతార కోపంతో కొచ్చిన్ వెళ్లిపోయారట. ఇది తెలుసుకుని ప్రభుదేవా అక్కడికి వెళ్లారట. వేగంగా కొచ్చిన్ అయితే వెళ్లగలిగారు కానీ నయనతార ఇంట్లో అడుగుపెట్టడానికి ఆయనకు రెండు గంటలపైనే పట్టిందట. ఆ తర్వాత ఆమె ప్రభుదేవా ఫోన్ చేసినా లేదుట. అంతేగాక ఇక సినిమాలు చేయనన్న ఆమె మలయాళ రంగానికి చెందిన ఓ ప్రముఖ పత్రికవారికి ఫోన్ చేసి, ఫొటోషూట్ చేస్తానని చెప్పారని చెప్తున్నారు.అంతేగాక బాడీగార్డ్ సీక్వెల్ లో నటించటానికి కూడా ఆమె సైన్ చేయాలని నిర్ణయించుకున్నారని వార్త. అంటే మళ్ళీ సినిమాల్లోకి ఆమె వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











