రజనీకాంత్ సినిమాలో నయనతార ఐటం సాంగ్
హైదరాబాద్: దక్షిణాదిన హీరోయిన్ నయనతార ఎంత డిమాండ్ ఉన్న హీరోయినో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందంతో పాటు, అభినయంలోనూ అదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇస్తూ తిరుగులేని హీరోయిన్‌గా దూసుకెలుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలు, విజయాలతో దుమ్ము రేపుతోంది.
గతంలో రజనీకాంత్ సరసన చంద్రముఖి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నయనతార....తాజాగా రజనీకాంత్‌తో 'లింగా' చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఆమె హీరోయిన్‌గా నటించడం లేదు. ఇందులో ఆమె స్పెషల్ ఐటం సాంగు చేయబోతోందని సమాచారం. సాధారణంగా ఐటం సాంగులకు దూరంగా ఉండే నయనతార.....రజనీకాంత్‌పై గౌరవంతో ఈ ఆఫర్‌కు ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయమై నయనతార నుండిగానీ, లింగా యూనిట్ సభ్యలు నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ సమాచారం అందలేదు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

నయనతారకు స్పెషల్ ఇంపార్టెన్స్
నయనతారతో ఐటం సాంగ్ చేయిస్తే సినిమాకు మంచి హైప్ వస్తుందని, అందుకే ఆమెకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.

నయతార పాపులారిటీ
నయనతార పాపులారిటీ కూడా సినిమా విజయానికి సహకరిస్తుందని, కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఐటం...
నయనతార గతంలో ధనుష్ నటించిన ఓ తమిళ సినిమాలో స్పెషల్ ఐటం సాంగు చేసింది.

నయనతార..
నయనతార ఐటం సాంగ్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయనున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

లింగా
రజనీకాంత్ హీరోగా ‘లింగా' అనే మరో చిత్రం కూడా మొదలైంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘లింగా' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మాస్తున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క షెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











