అందమైన ఫిజిక్ దేముడు ఇచ్చాడనే...నయనతార
"దేముడు నాకిచ్చిన గొప్ప వరం...నా ఫిజిక్. అందుకే నేను భగవంతుడిని బాగా నమ్ముతాను అంటోంది నయనతార. అలాగే మానవాతీతమైన శక్తి లేనిదే సృష్టి లేదని చిన్నప్పటి నుంచి నా నమ్మకం..అంతెందుకు ఒక్క సారి ఈ గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టాక తప్పకుండా అన్ని రకాల డ్రస్సులను వేసుకోవాల్సి ఉంటుంది. నా అదృష్టం ఏమిటంటే బికినీ నుంచి నిండైన చీరకట్టు వరకు ఏది కట్టుకున్నా అందంగానే కనిపిస్తాను అంటోంది నయనతార. అలాగే కొన్ని సార్లు షూటింగ్‌లతో బిజీగా ఉండి వ్యాయామం చేయడానికి తీరిక లేకపోయినా, మరికొన్ని సార్లు విరామం ఎక్కువై ఇంట్లో ఉండి పుష్టిగా తిన్నా కూడా నా ఫిజిక్‌లో పెద్దగా మార్పు రాదు. అందమైన శరీర సౌష్టవం నా సొంతం కావడం నిజంగా దేవుడిచ్చిన వరమే మరి'' అంటోందీ ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నయనతార...బాలకృష్ణ సరసన రామరాజ్యం చిత్రంలో చేస్తోంది. బాపు దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె సీతగా కనపించనుంది.


Click it and Unblock the Notifications











