నయనతారకు ఆయన అండ

By Staff

నయనతారపై ఆ మధ్య తమిళ చిత్ర పరిశ్రమ బ్యాన్ విధించి ఎత్తివేశింది. అయితే అంత హఠాత్తుగా బ్యాన్ ఎందుకు ఎత్తేశారన్నది మాత్రం అందరికీ ఓ సస్పెన్స్ గా మిగిలింది. అయితే ఇప్పుడా విషయాలను వెళ్ళడిస్తూ ఓ తమిళ పత్రిక ఎక్సక్లూజివ్ స్టోరీ వేసారు. నయనతార వెనక ఉన్నది మరెవరో కాదు రెడ్ జెయింట్ మూవీస్ ఛైర్మన్ ఉదయనిధి స్టాలిన్ అని తేల్చారు. ఆయన ఎంటర్ అవటం వల్లే లింగుస్వామి ఆమె సోదరుడు ఇద్దరూ సైలెంట్ అయిపోయారని రాసుకొచ్చింది. అలాగే అప్పట్లో నయనతార డబ్బు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్న విషయాన్ని సైతం ఖండించింది. ఆమెకా అవసరం లేకుండా పోయిందని తేల్చింది. ఎందుకలా స్టాలిన్ చేయవలిసి వచ్చిందీ అంటే..నయనతార తనపై బ్యాన్ పెట్టగానే స్టాలిన్ ని కలిసింది.

వారు అప్పటికే అదయవాన్ అనే సినిమాను ప్లాన్ చేసారు. కె.ఎస్.రవికుమార్ డైరక్ట్ చేసే ఈ చిత్రంలో సూర్య హీరో. దాంతో ఆమెను హీరోయిన్ గా చేయాలని చెప్పారు. ఆమె తనపై బ్యాన్ విషయం చెప్పింది. దాంతో స్టాలిన్ ఏం భయపడాల్సిన అవసరం లేదని తన ఇన్ఫూలియన్స్ తో విషయం సెటిల్ చేస్తానని మాట ఇచ్చారు. దాంతో ఆమె ధైర్యంగా లింగు స్వామితో డబ్బు కట్టాల్సిన అవసరం లేదంటూ ఛాలెంజ్ చేయటం జరిగింది. ఇంత ధైర్యంగా మాట్లాడటం వెనుక ఎవరు ఉన్నారు అని తెలుసుకున్న వారు సైలెంట్ అయ్యారు. అలాగే తమిళ నిర్మాతల మండిలితో స్టాలిన్ ఒక్క ఫోన్ చేసి బ్యాన్ ఎత్తించాడు. నయనతార దాంతో ఆ తర్వాత స్టాలిన్ కి ఓ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి కృతజ్ఞతలు చెప్పుకుందని వారు రాసుకొచ్చారు. ఇదీ బ్యాన్ ఎత్తేయటం వెనక తెరచాటు కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X