ఆడదాన్నననే: నయనతార

అలాగే మరో విషయం ఫలానా రకంగా ఉండాలని ఎవరూ నన్ను ఫోర్స్ చేయలేరు..చేయలేదు..ఓ ఇండిపెండింట్ మహిళగా నాకున్న ఆలోచనా పరిధిలో నా నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తున్నాను. నా ఆత్మాభిమానం కన్నా ఏదీ ఎక్కువ కాదు...ఈ వివాదంలో నేను నటిని..ఆడదాన్ని కాబట్టే టార్గెట్ చేసారు..కానీ నేను న్యాయం కోసం పోరాడుతాను అని మీడియాకు వెళ్ళడించింది.
ఇక ఈ వివాదం దర్శకుడు లింగు స్వామి తన సోదరుడు చంద్రబోస్ నిర్మించనున్నపయ్యా సినిమా నిమిత్తం చెల్లించిన అడ్వాన్స్ తిరిగి చెల్లించమనంటంలో ప్రారంభమైంది. మొదట ఇరవై లక్షలు అడ్వాన్స్ గా కోటి రెమ్యునేషన్ గా అనుకున్నారు. అయితే నయనతార వరస ఫ్లాపులు, రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న ఆర్ధికమాణ్యం గమనించి అంత రెమ్యునేషన్ ఇచ్చుకోలేమన్నారు. ఆమె ఒప్పుకోలేదు. మొదట అనుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం కానివ్వమంది. దాంతో వారు ఆమె స్ధానంలో తమన్నాని తీసుకుని అడ్వాన్స్ తిరిగి ఇమ్మన్నారు. ఆమె తనని ఖాలీగా ఉంచినందుకు పరిహారంగా ఆ అడ్వాన్స్ జమకట్టుకుంటున్నానని చెప్పింది. అదే ఇంత గొడవకూ కారణమైంది.


Click it and Unblock the Notifications











