పగ పట్టు పడుచు...నయనతార

By Staff

Nayantara
ఆ మధ్య వరస హిట్లతో ఒక వెలుగు వెలిగిన శింబు ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. అదీ తన ఒకప్పటి లవర్ ..టాప్ హీరోయిన్ అయిన నయనతారతోనేట. మన్మధ లో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన రీతిలోనే నయనతార శింబుని చావు దెబ్బకొట్టిందని అందరి దగ్గరా చెప్పుకుని భాధపడుతున్నాడట. భారీ అంచనాలతో రిలీజయిన 'వల్లవన్', 'కాలై' సినిమాలు రెండూ బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యాయి. అతను డైరెక్ట్ చేయాలనుకుంటున్న 'కేట్టవాన్' చాలా కాలం నుంచి పెండింగులో వుండిపోయింది. దాంతో మిగతా హీరోల్లా శింబు బాలీవుడ్‌లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తన హిట్టైన సినిమాల్నిముఖ్యంగా 'మన్మథన్'ని హిందీలో రీమేక్ చేయాలని శింబు నిర్ణయించుకున్నాడు.

అయితే అతనికి హీరోయిన్ల సమస్య వచ్చిపడింది. బాలీవుడ్‌లో పేరుపొందిన తారలెవరూ అతని సరసన నటించే అవకాశాలు లేవు. అతని టాలెంట్ గురించి వాళ్లకి ఏమీ తెలీదు కాబట్టి. పోనీ దక్షిణాదిన టాప్ హీరోయిన్లని తీసుకుదామనుకున్నా.. త్రిష, శ్రియ, భావన, అసిన్ వంటి తారలు అతనితో చేయడానికి ఇష్టపడటం లేదు. నయనతారతో అతడు వ్యవహరించిన తీరే దానికి కారణం. వారితో ఆమెకున్న పరిచయాలు...ఆమె చేసిన నెగిటివ్ పబ్లిసిటీ. దాంతో కొత్త ముఖాలతోనే నటించాలని అతను భావిస్తున్నట్లు కనిపిస్తోంది. నయనతారా ఏం ట్విస్టు ఇచ్చావు... సైలెంట్ గా ఉండి. అతని కెరీర్ మొత్తాని కే చెక్ పెట్టే స్ధితి తెచ్చిపెట్టావు కదా. సామాన్యురాలివు కాదు...అంటున్నారు కోలివుడ్ వాసులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X