ఏం పెద్ద హీరో అయితే గొప్పా? నయనతార
రజనీకాంత్‌తో కలిసి చంద్రముఖి లో నటించినప్పుడు ఆయన్ని చూసి మీరు భయపడలేదా? అని చాలా మంది అడిగారు. అసలు నేను ఆయన్ని చూసి ఎందుకు భయపడాలో ఎప్పటికీ అర్థం కాదు. సహ నటీనటుల నుంచి నేర్చుకోవాల్సింది ఏముంటుంది? అని కొట్టినట్లు చెప్పుకొచ్చింది నయనతార. అలాగే ఆమె ఈ టాపిక్ పై మాట్లాడుతూ..అయినా ఈ సినీ రంగంలో అడుగుపెట్టామంటేనే అంతో ఇంతో తెలియబట్టే కదా. తెలిసినదాంతో ముందుకు సాగితే మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. దాన్ని నిలుపుకోవడానికే నా తాపత్రయం..అంతే తప్ప వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అనే కాన్సెప్టు ఎప్పుడూ లేదు.. అయినా ఎవరో ఏదో చేశారని వారి బాట పట్టడం నాకు నచ్చదు. గొప్ప వారందరూ ఎప్పుడూ స్ఫూర్తిని పంచుతారు. ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. నేను మొదటి నుంచీ అనుసరిస్తున్న విధానం ఇదే అంది. మరి కమల్ హాసన్ తో మీరు సినిమా చేయబోతున్నారట కదా అని మీడియా వారు అడిగితే.. ''సంతకం పెట్టకముందు అసలు సినిమాల గురించి మాట్లాడను. ఆ విషయాన్ని ఆ నిర్మాతలే చెప్పాలి. ముందు చెప్పే అలవాటు నాకు లేదు'' అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం నయనతార బాలకష్ణ సరసన సింహా చిత్రంలో చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ తో చేసిన అదుర్స్ చిత్రం త్వరలో రిలీజు అవుతోంది.


Click it and Unblock the Notifications











