ఆ ఒత్తడి ఎక్కువైంది:నయనతార
ఆ రకమైన ఒత్తిడి కచ్చితంగా మా అందం, ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి నా షూటింగ్ మీద కూడా పడింది. మనసు పెట్టి పని చేయలేకపోతున్నాను. అందుకే కాసింత మనశ్శాంతిని కోరుకుంటున్నాను అంటోంది నయనతార. తనపై లేనిపోని రూమర్స్ సృష్ఠించటం వల్ల తనలో లేనిపోని ఒత్తిడి పుడుతోందని అందువల్ల తన ఫిటెనెస్ దెబ్బతింటోందని ఆమె చెపుతోంది.
శింబుతో ప్రేమాయణం...నిర్మాతతో వివాదం...పారితోషికం డిమాండ్...ప్రభుదేవాతో పెళ్ళి...అంటూ వరసగా తనపై వార్తలు ప్రచురిస్తున్నారని వాటివల్ల తాను నష్టపోతున్నానని అంది. ఆ రూమర్స్ కి మీరు ఫుల్‌స్టాప్ పెడితే నా ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడినవారవుతారు' అంటున్నారామె.ఉన్నవి ఉన్నట్లు రాయండి. దయచేసి వదంతులు ప్రచారం చేసి నష్టపరచవద్దు అంటోంది.
అయినా మేం అంటే హీరోయిన్స్ అందంగా ఉండాలని సినిమా పరిశ్రమ, ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ అదేంటో గానీ మా గురించి రోజుకో వార్త ప్రచారం చేసి ఆనందిస్తుంటారు. ఈ ఒత్తిడి కచ్చితంగా మా అందం, ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులు కూకూడా దిగులుపడతారు. ఈ మధ్యకాలంలో నా గురించి వచ్చిన వదంతులు మా అమ్మా, నాన్నని బాగా కుంగదీశాయి. వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను ఇరకాటంలో పడ్డాను. అంటూ నయనతార తన మానసిక ఒత్తిడికి కారణాలు వివరించింది.


Click it and Unblock the Notifications











