థియేటర్ లో రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాడెడ్ గా దొరికిపోయిన హీరో, హీరోయిన్...!?
హన్సిక మోజులో పడి నయనతారని నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రభుదేవా గురించి వస్తోన్న వదంతులన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. ఈ ప్రేమజంట రీసెంట్ గా చెన్నయ్ లోని వడపళనిలో గల కమలా థియేటర్ లో సినిమా చూడ్డానికి వచ్చింది. ఆ సమయంలో చుట్టూ ఉన్న జనాన్ని కూడా మరిచిపోయి పీకల్లోతు ప్రేమమత్తులో మునిగిపోయింది. సినిమా చూడ్డం మానేసి ఈ జంట తోటి ప్రేక్షకులకి లైవ్ షో చూపించింది. చేతిలో చెయ్యేసుకుని, కళ్లతోనే ఊసులు చెప్పుకుంటూ మూడు గంటల ఏకాంతాన్ని పూర్తిగా ఆస్వాదించింది.
దీనికంతటికీ కారణం ప్రకాష్ రాజ్ ను ఇన్స్ పిరేషన్ గా తీసుకొని ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలితకు విడాకులు ఇచ్చేసి, దైర్యంగా పోనీవర్మను పెళ్లాడు. దాంతో రంగంలోకి దిగిన నయన్ ప్రభుదేవాని మొదటి భార్యకు విడాకులిచ్చి తనను పెళ్ళి చేసుకోవాలని వత్తిడి చేస్తోన్నట్టు తెలుస్తోంది. అదే గనుక జరిగితే వీళ్లిద్దరి పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ త్వరలోనే తొలగిపోనున్నాయని, తొందర్లోనే పెళ్లి కబురు వినిపించనుందని కోలీవుడ్ సర్కిల్స్ అంటున్నాయి. అందుకే కాబోలు ప్రభుదేవాను విడవకుండా 'ఇచ్" షూటింగ్ లోనూ, తర్వాత 'ఉరిమి" సినిమా షూటింగ్ నిమిత్తం ప్రభుదేవాతో కలిసి నయనతార మహారాష్ట్ర వెళుతోందట. ఆ షెడ్యూల్ మొత్తం ప్రభుదేవాతో కలిసి నయనతార ఉండబోతోందని సమాచారమ్. షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నై చేరేలోపు ప్రభుదేవా తో తీపి కబురు చెప్పించుకొనుటకే ఈ ప్రయత్నాలన్ని చేస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications











