ప్రభుదేవా భార్య భయంతోనే...నయనతార
ప్రభుదేవా భార్య రమాలత నుంచి తనకు ప్రమాదం ఉందని తాజాగా నయనతార ప్రెవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది.అలాగే చెన్నై లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాల్సిందిగా నిర్మాతలను డిమాండ్ చేస్తోంది. ఈ నెల 18 నుంచి ఆర్య హీరోగా నయనతార కాంబినేషన్ లో 'బాస్ అలియాస్ భాస్కరన్' షూటింగ్ చెన్నైలో జరగనుంది. అందునిమిత్తం నిర్మాత పోలీస్ ప్రొటెక్షన్ కోరటంతో ఈ విషయాలు బయిటకు వచ్చాయి. మరో ప్రక్క ప్రభుదేవాతో తనకు ఏ విధమైన రిలేషన్ లేదని నయనతార పదేపదే స్పష్టం చేస్తోంది. అయితే నయనతారతో తన భర్త తిరుగటం నిజమేనని, చెన్నైలో ఆమె కనిపిస్తే దాడికి దిగటం ఖాయమని ప్రభుదేవా భార్య హెచ్చరిస్తోంది. ఇక నయనతార హీరోయిన్ గా చేసిన అదుర్స్ చిత్రం రేపు(బుధవారం) ప్రపంచమంతటా రిలీజ్ అవుతోంది.
నయనతార ప్రభుదేవా అదుర్స్ జూ ఎన్టీఆర్ రమాలత సెల్యూట్ nayantara prabhudeva rama latha adurs jr ntr vv vinayak arya


Click it and Unblock the Notifications