డిసెంబర్ లో ప్రభుదేవాతో నయనతార పెళ్లి
పీకల లోతు ప్రేమలో కూరుకుపోయిన ప్రభుదేవా, నయనతార పెళ్లి డిసెంబర్ లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని తమిళ పత్రికలు ఈ విషయంపై వార్తాకథనాలు ప్రచురించాయి. అందుకే నయనతార కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని తెలుస్తోంది. తెలుగు, తమిళ చిత్రాలతో నయనతార ఇప్పటి వరకు బిజీగా ఉంది. ఇటీవ ఓ తమిళ సినిమా కూడా చేసింది. ఈ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత కొత్త చిత్రాలకు ఆమె నో అంటోంది. యాడ్ ఫిల్మ్స్ లో నటించడానికి ఏ మాత్రం ఒప్పుకోని నయనతార ఇటీవల ఓ యాడ్ లో నటించడానికి అంగీకరించింది. దానికి కారణం ప్రభుదేవానేనట. ఆ యాడ్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించడానికి అతను అంగీకరించాడు. అయితే, అనివార్య కారణాల వల్ల అతను దాని నుంచి తప్పుకున్నాడు. వెంటనే నయన తార కూడా దానికి స్వస్తి చెప్పేసిందని వార్తలు.


Click it and Unblock the Notifications











