ఫ్రీగా నటిస్తున్న కోటి రూపాయిల హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో పోల్చుకొంటే హీరోస్ కు అంత కాంపిటీషన్ లేదు. రీజన్ వారికంటు స్వంత మార్కట్ ఉంటుంది. అది ఆయా హీరోస్ యొక్క ఫాన్స్ తో బేస్ చేసుకొని ఉంటుంది. అయితే హీరోయిన్స్ అలా సంతృప్తి పడరు. అందరూ హీరోయిన్ప్ తామే టాప్ లో ఉండాలని చూస్తారు. అంతే కాకుండా కొంత మంది హీరోయిన్స్ (ఆసిన్, శ్రియ) టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళడానికి మక్కువ చూపిస్తున్నారు. సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుంటారు. డబ్బు అవసరమే కానీ ప్రతి ఆనందాన్నీ డబ్బుతో కొనలేం.
కోటి రూపాయిల పారితోషికం తీసుకునే నయనతార ఒక్క పైసా తీసుకోకుండా ఓ మలయాళ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఆమె నటిగా తనను తాను సంతృప్తి పరచుకోవడానికి ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ తీసే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. అందులోనూ మాతృ భాషలో ఫ్రీగా నటించడం ఆమెకు ఆనందాన్ని కలుగజేస్తోందట. శ్యామ్ ప్రసాద్ గతంలో శోభన, మీరాజాస్మిన్, మమ్ముట్టిలతో 'అగ్నిసాక్షి", 'ఒరే కాదల్ ఆకలే", 'రితు" వంటి అవార్డు చిత్రాలను రూపొందించారు. ఓ గ్రీకు నాటకం ఆధారంగా తాజా చిత్రం రూపొందుతోంది. ఆర్య హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోంది. పైసా తీసుకోకుండా మంచి చిత్రాల్లో అగ్ర హీరోలు, హీరోయిన్లు నటిస్తే వర్థమాన నటీనటులకు ఆదర్శంగా నిలుస్తారు.


Click it and Unblock the Notifications











