ఆయన్ని నిలదీయకూడదు : నయనతార

By Srikanya

చెన్నై : ''దేవుడా... ఇలా ఎందుకు చేశావ్‌? అని ఆయన్ని నిలదీయకూడదు. ఈ సృష్టి ఆయనది. ఆయన ఏం చేసినా మన క్షేమం తప్పకుండా ఆలోచిస్తారు'' అంటోంది నయనతార. ప్రేమ విఫలమైన నాటి నుంచీ నయనతారలో ఆధ్యాత్మిక భావనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే... ''మన జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనకూ ఓ కారణం తప్పకుండా ఉంటుంది. వాటిని వెతుక్కొంటూ పోతే అసలు నిజం బోధపడుతుంది'' అని చెప్పింది నయనతార.

ఇంతకీ మీ ఇష్టదైవం ఎవరు? అని నయనతారను అడిగితే ''ప్రత్యేకంగా ఒకరంటూ ఏమీ ఉండరు. అలా చెప్పడం దైవత్వాన్ని తక్కువ చేయడమే. అన్ని మతాల సారాన్ని విశ్వసిస్తాను. భగవంతుణ్ని కళ్లతోకాదు మనసుతో చూడాలి'' అని చెప్పింది. అలాగే ''నేను నటించిన సినిమా పరాజయం పొందితే... ఒక్క నిమిషం బాధపడతానంతే. వెంటనే మరో పనిలో పడిపోతాను. జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు నిమిషాల్లో మర్చిపోలేంగానీ... కోలుకోవడానికి సమయం పడుతుంది. ప్రేమపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నా కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు'' అంటోంది.

ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున, దశరథ్ కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే చిత్రం చేస్తోంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. నయనతార గొంతు త్వరలో తెలుగు తెరపై వినపడనుంది. నయనతార,రానా కాంబినేషన్ లో రూపొందుతున్న 'కృష్ణంవందే జగద్గురుమ్' సినిమా కోసం నయనతార తన గొంతును సవరించింది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే ప్రథమం.

'కృష్ణంవందే జగద్గురుమ్' లో నయన పాత్ర పేరు దేవిక. డాషింగ్ జర్నలిస్ట్. ఈ పాత్రకు నయనతారే డబ్బింగ్ చెబితే బావుంటుందని ఆ చిత్ర దర్శకుడు క్రిష్ భావించడంతో... నయన ఉత్సాహంతో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేశారు. దర్శకుడు క్రిష్ తన చిత్రంలో నయనతార పాత్ర గురించి మాట్లాడుతూ.....''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X