ప్రభుదేవాతో బ్రేకప్.. అదో గుణపాఠం.. అసలు విషయం బయటపెట్టిన నయనతార

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ నయనతార ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. దాదాపు 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశారు. ఆమె కొనసాగించిన అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు వివాదాస్పదంగా మారాయి. గతంలో ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ సందర్భంగా నయనతార చెప్పిన విషయాలు ఏమిటంటే..

ఐషా శర్మ.. క్లివేజ్ షో రచ్చ మాములుగా లేదు

 శ్రీరామదాసు మూవీ సమయంలో

శ్రీరామదాసు మూవీ సమయంలో

నయనతార జీవితంలో 2010 నుంచి 2015 వరకు కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం ఆమెను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసింది. శ్రీరామ‌దాసు షూటింగు కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవా, నయనతార పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ సమయంలో శ్రీరామదాసు తనకు చివరి సినిమా అంటూ ప్రకటించింది.

బాధతో నయనతార

బాధతో నయనతార

శ్రీరామదాసు షూటింగు చివరి రోజున దర్శకుడు, స్వర్గీయ బాపు ఎదుటే కన్నీటి పెట్టుకొన్నారు. సినీ పరిశ్రమకు దూరమై వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నామనే విషయాన్ని చెప్పడం బాధపడి పోయారు. ఆ సందర్భంగా నయనతారను బాపు ఓదార్చారు. అయితే అనూహ్యంగా వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

మానసికంగా కుంగిపోయిన నయనతార

మానసికంగా కుంగిపోయిన నయనతార

ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయనతార మానసికంగా చాలా కుంగిపోయినట్టు ఆమె సన్నిహితులు, స్నేహితులు చెప్పుకొంటారు. ఆ బ్రేకప్ నుంచి బయటపడటానికి చాలా సమయం తీసుకొన్నారు. కానీ మానసికంగా చాలా ధృడంగా తయారయ్యారు అని పేర్కొంటారు. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని తీర్చు దిద్దుకొన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రేకప్ నుంచి బయటపడి లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగింది.

 జీవితంలో మంచి, చెడుల గురించి

జీవితంలో మంచి, చెడుల గురించి

ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత జీవితంలో చాలా గుణపాఠాలు నేర్చుకొన్నాను. వ్యక్తిగా నేను చాలా మారాను. ఆ మార్పు మంచో, చెడో చెప్పలేను. కానీ చాలా మార్పులు నాలో జరిగాయి. ఒక వ్యక్తికి దూరమైన తర్వాత ప్రతీ మనిషిలో అలాంటి మార్పులు జరుగుతాయి. అవే నాలో జరిగాయి అంటూ నయనతార తెలిపారు.

Recommended Video

Karthi emotional words On Akkineni Nagarjuna | Sulthan Movie
బ్రేకప్ దెబ్బతో అలాంటి అనుభవం

బ్రేకప్ దెబ్బతో అలాంటి అనుభవం

ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నా జీవితం తలకిందులైనట్టు అనిపించింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి మానసికంగా సిద్ధమయ్యాను. నా కంటూ ఓ లైఫ్ ఉంది.. దానిని లీడ్ చేయాలని నిర్ణయించుకొన్నాను. నాకు ఎదురైన సమస్యకు ధీటుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యాను అని నయనతార చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X