నయనతార - విఘ్నేష్ వీడియో వైరల్: పెళ్లికి పది రోజుల ముందే మరో షాకింగ్ డెసీషన్
మిగిలిన రంగాలతో పోల్చుకుంటే గ్లామర్ ఫీల్డులో ప్రేమాయణాలు కాసింత ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఇక్కడ లవ్ ట్రాకులు నడపడం.. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవడం.. లేకుంటే బ్రేకప్‌లు చెప్పుకోవడం చాలా సర్వసాధారణమైన విషయాలు. అయినప్పటికీ సినీ రంగంలో ఎవరు ప్రేమలో ఉన్నా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతుంటారు.
అలా చాలా ఏళ్లుగా వార్తల్లో నిలుస్తోన్న జంటల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జోడీ ఒకటి. వీళ్లిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే తమ వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నయన్, విఘ్నేష్ పెళ్లిపై ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసం!

విఘ్నేష్‌తో నయన్ లవ్ ట్రాక్
కెరీర్ పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం పలుమార్లు విఫలమైంది. గతంతో ఓ స్టార్ హీరోతో పాటు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన ఈమె.. వాళ్లిద్దరితో బంధాన్ని మధ్యలోనే ఆపేసింది. ఇలా రెండు బ్రేకప్‌ల తర్వాత ఇప్పుడు ఆమె విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

పబ్లిక్‌గానే తిరుగుతోన్న జంట
స్టార్ హీరోయిన్ నయనతార విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లు సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపించారు. కానీ, కొన్నేళ్ల క్రితం తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఈ జంట అప్పటి నుంచి పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని హైలైట్ అవుతోంది.

రింగ్ తొడిగినా... పెళ్లి మాత్రం
నయనతార చాలా కాలంగా విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్నా.. పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు వీళ్లు వివాహం చేసుకుంటారా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించింది. ఇక, కొద్ది రోజుల క్రితమే నుదుటిపై బొట్టుతో కనిపించింది. దీంతో వీళ్ల పెళ్లి అయిందని పుకార్లు వచ్చాయి.
లీకైన నయనతార పెళ్లి డేట్
నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ నిజంగానే ఏడడుగులు నడవబోతున్నారని తెలిసింది. అంతేకాదు, ఈ జంట జూన్ 9న వివాహం కూడా చేసుకోబోతుందని ఓ న్యూస్ లీకైంది. దీంతో వీళ్లిద్దరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుండగా.. కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసేస్తున్నారు.

వివాహ వేదిక మారిందని లీక్
నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం హిందూ, క్రిస్టియన్ పద్దతిలో జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే హిందూ వివాహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరపబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. వీళ్ల పెళ్లి తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరగనుందని తెలిసింది.

నయన్, విఘ్నేష్ వీడియోనా
ఇక, విఘ్నేష్ శివన్ - నయనతార వివాహానికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట. అయితే, చెన్నైలో మాత్రం రిసెప్షన్ ఎంతో గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా.. వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో ఇన్విటేషన్ ఇదేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. దీంతో ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











