For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతార పెళ్లి జోష్.. ప్రియుడితో కలిసి అక్కడికి.. మ్యారేజ్ ముహుర్తం ఎప్పుడంటే!

  |

  అందాల భామ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారనే విషయం దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరికి తెలిసిందే. తమ ఫోటోలను సోషల్ మీడియాలో తమ రొమాంటిక్ ముూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ తమ బంధానికి బలం చేకూర్చేలా వారిద్దరు వ్యవహరిస్తున్నారు. అయితే ఇక తమ బంధానికి అర్ధం కలిగించేలా వారిద్దరు ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం. నయన్, విఘ్నేశ్ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

   శింబు, ప్రభుదేవాతో బ్రేకప్స్

  శింబు, ప్రభుదేవాతో బ్రేకప్స్

  వరుస బ్రేకప్‌లు నయనతార జీవితాన్ని ఓ కుదుపు కుదిపేసాయి. అయినా మనో నిబ్బరంతో కెరీర్‌ను ఆమె ముందుకు తీసుకెళ్లారు. శింబు, ప్రభుదేవాలతో అఫైర్లు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయాయి. ఆ తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో సహజీవనం చేస్తున్నారనే వార్తలు క్రమంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వారి పెళ్లి వార్త మరోసారి మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

   విఘ్నేశ్‌తో పెళ్లి వార్త వైరల్

  విఘ్నేశ్‌తో పెళ్లి వార్త వైరల్

  కొద్దికాలంగా నయన్ పెళ్లి వార్త దక్షిణాది ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతున్నది. అయితే వారిద్దరూ మాత్రం ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడిందనే వార్త మీడియా చక్కర్లు కొడుతున్నది.

  హిందూ దేవాలయాల సందర్శన

  హిందూ దేవాలయాల సందర్శన

  పెళ్లికి ముందు దేవుళ్లకు మొక్కు చెల్లించుకొనేందుకు నయన్, విఘ్నేశ్ హిందూ దేవాయాలను సందర్శిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలను వాళ్లు సందర్శించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా కొన్ని ఆలయాలను సందర్శించలేకోపోయారు. దాంతో వారి పెళ్లిపై ఈ అంశం ప్రభావం చూపించిందనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

  మొక్కుల చెల్లింపు తర్వాతే వివాహం

  మొక్కుల చెల్లింపు తర్వాతే వివాహం

  నయనతారకు దైవభక్తి, జాతకాలు, ముహుర్తాలపై చాలా ఎక్కువ నమ్మకం ఉందని చెప్పుకొంటారు. అయితే లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకొని ఆ తర్వాత మొక్కులు చెల్లించుకొందామనే ప్రపోజల్‌ను నయన్ తార ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించిందనే విషయం సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది.

  త్వరలో రాహు ఆలయ సందర్శన

  త్వరలో రాహు ఆలయ సందర్శన

  నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌తో కలిసి తమిళనాడులోని ప్రతిష్టాత్మకమైన రాహు ఆలయంలో పూజలు నిర్వహించాలని నిర్ణయించుకొన్నారట. త్వరలోనే కుంభకోణంలోని తిరునాగేశ్వరమ్ ఆలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అక్కడ పూజలు చేసిన తర్వాత వారు తమ పెళ్లి తేదీలను ప్రకటించనున్నారని సమాచారం.

  కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
  నయనతార కెరీర్ విషయానికి వస్తే..

  నయనతార కెరీర్ విషయానికి వస్తే..

  ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ముక్తి అమ్మన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తన ప్రియుడు విఘ్నేశ్ నిర్మించి దర్శకత్వం వహించే కాథువాకులా రెండు కాదల్ సినిమాలో నటించాననున్నారు. ఈ చిత్రంలో సమంత, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు తప్ప నయన మరే చిత్రాన్ని అంగీకరించినట్టు అధికారికంగా సమాచారం లేదు. పెళ్లి కారణంగానే ఆమె తన సినిమాలను వాయిదా వేసుకొంటున్నారని చెబుతున్నారు.

  English summary
  Nayanthara and Vignesh Shivan decided to get married soon. They had planned before March, But Lockdown make their plans get postponed. They soon visit the Lord Rahu's temple in Thirunageswaram near Kumbakonam. After that they will announce marriage dates.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X