For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హనీమూన్‌లో విఘ్నేష్, నయనతార రచ్చ: అలా కౌగిలించుకుని మరీ రొమాంటిక్‌గా!

  |

  మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాల్లోనే ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా మంది ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకుని వెళ్తారు. అలాంటి వారిలో ఎన్నో ఏళ్ల పాటు ప్రేమ పక్షుల్లా విహరించి, ఇటీవలే ఒక్కటైన లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి. పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లిన ఈ కపుల్.. అక్కడ యమ రొమాంటిక్‌గా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నయన్, విఘ్నేష్ జోడీ వదిలిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. దానిపై మీరూ లుక్కేయండి!

  విఘ్నేష్‌తో నయన్ లవ్ ట్రాక్

  విఘ్నేష్‌తో నయన్ లవ్ ట్రాక్

  కెరీర్ పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం పలుమార్లు విఫలమైంది. గతంతో పలువురితో ప్రేమాయణం సాగించిన ఈమె.. వాళ్లతో బంధాన్ని మాత్రం పెళ్లి వరకూ తీసుకెళ్లలేదు. ఇలా కొన్ని బ్రేకప్‌ల తర్వాత నయన్.. విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలెట్టి.. నాలుగేళ్ల పాటు అతడితో బంధాన్ని కొనసాగించింది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ లవర్ బాయ్.. అప్పుడు మిస్సైనా ఈ సారి కన్ఫార్మ్‌!

  ఎట్టకేలకు పెళ్లాడిన సినీ జోడీ

  ఎట్టకేలకు పెళ్లాడిన సినీ జోడీ


  సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించిన నయనతార.. విఘ్నేష్ శివన్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్‌‌‌లో పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వర్క్ జరిగింది. దీంతో ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

  హనీమూన్‌లో జంట ఎంజాయ్

  హనీమూన్‌లో జంట ఎంజాయ్

  వివాహం చేసుకున్న తర్వాత నయనతార - విఘ్నేష్ శివన్ జోడీ ఇండియాలోని పలు దేవాలయాలను సందర్శించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవాలయంలో చెప్పులతో వెళ్లిందని పెద్ద వివాదమే చెలరేగింది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీళ్లిద్దరూ తమ కొత్త జీవితాన్ని తెగ ఎంజాయ్ చేశారు.

  లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

  సోషల్ మీడియాలో అప్‌డేట్లు

  సోషల్ మీడియాలో అప్‌డేట్లు

  హనీమూన్‌లో జంటగా సందడి చేసిన నయనతార - విఘ్నేష్ శివన్.. ఈ ట్రిప్‌లో తన మధురానుభూతులను కెమెరాల్లో బంధించారు. ఇందులో భాగంగానే అక్కడ గడిపిన క్షణాలకు తాలుకా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దీంతో వీళ్లిద్దరి అభిమానుల నుంచి వాటికి భారీ రెస్పాన్స్ దక్కేది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి.

  రొమాంటిక్ పిక్ వదిలిన విక్కీ

  రొమాంటిక్ పిక్ వదిలిన విక్కీ

  లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు నయనతార తనను ఎదపైకి హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

  హాట్ వీడియో షేర్ చేసిన శృతి హాసన్: టాప్‌ను పైకి లేపి మరీ హాట్ ట్రీట్

  దీన్ని నా పుట్టినరోజు అంటూ

  దీన్ని నా పుట్టినరోజు అంటూ


  నయనతార తనను హత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విఘ్నేష్ శివన్.. 'దీన్ని నా పుట్టినరోజు అనుకోండి' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో అతడి ఫీలింగ్స్‌ను, ప్రేమను పరోక్షంగా వ్యక్త పరిచాడు. ఇక, విఘ్నేష్ శివన్ - నయనతార హగ్ చేసుకున్న ఈ రొమాంటిక్ పిక్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది కాసేపట్లోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Kollywood Newly Married Couple Nayanthara and Vignesh Shivan Went foreign Honeymoon. Now Their Romantic Pic Gone Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X