Actress Nayanthara: ఎక్కడికి వెళ్లినా ప్రియుడిని వదలని తార.. ఏదైనా జంటగానే.. ఆఖరికి వ్యాక్సిన్ కూడా!

కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చాలా రోజుల తరువాత వార్తల్లో నిలుస్తోంది. ఎక్కడికి వెళ్లినా కూడా తన ప్రియుడిని వెంట పెట్టుకొని వెళుతోంది. దేవాలయాలకు వెళ్లినా విదేశాలకు వెళ్లినా కూడా విగ్నేష్ శివన్ లేనిదే ఎక్కడికి ఒంటరిగా వెళ్లడం లేదు. ప్రత్యేకంగా స్పెషల్ చార్టెట్ ఫ్లైట్ లో కూడా ట్రావెలింగ్ చేస్తున్నారు. ఇక ఇటీవల వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా నయన్ కాబోయే వాడితో కలిసే వెళ్లింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు

అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు

స్టార్ హీరోయిన్స్ ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. కానీ నయనతారకు ఎవరు పోటీ ఇవ్వడం లేదు. ఎంత మంది గ్లామరస్ బ్యూటీస్ వచ్చినా కూడా నయన్ కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమెకు రావాల్సిన పాత్రలు బాగానే వస్తున్నాయి. నటనలో ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవడం నయన్ కు హెల్ప్ అవుతోంది.

ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ..

ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ..

నయనతార పర్సనల్ వివధాలు ఎప్పుడు కూడా ఆమె సినిమాలపై కెరీర్ పై ప్రభావం చూపలేదు. ఆ విధంగా నయన్ ప్లాన్ చేసుకుంటూ నటిగా క్రమశిక్షణతో నడుచుకుంటోంది. శింబు, ప్రభుదేవా వంటి స్టార్స్ ప్రేమలో ఫెయిల్ అవ్వడం అప్పట్లో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

టీకాలు వేయించుకున్న జంట

టీకాలు వేయించుకున్న జంట

దర్శకుడు విగ్నేష్ శివన్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న నయనతార ఎక్కడికెళ్లినా కూడా అతన్ని వదలడం లేదు. ఇక ఇద్దరు కలిసి మంగళవారం టీకాలు వేయించుకున్నారు. విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. "దయచేసి టీకాలు వేయించుకొని సురక్షితంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి " అని విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

సెకండ్ వేవ్ ఎక్కువవ్వడంతో

సెకండ్ వేవ్ ఎక్కువవ్వడంతో

ఇక వీరి పెళ్లిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఒక గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సెకండ్ వేవ్ ఎక్కువవ్వడంతో మళ్ళీ వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చినప్పటికీ విగ్నేష్ శివన్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేమని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం నయన్ రెండు సినిమాలతో బిజీగా వుంది. ఇక విగ్నేష్ తో చేసిన మరో రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X