»   »  వరుసగా రెండో ఏడాది కూడా నయనతారే!

వరుసగా రెండో ఏడాది కూడా నయనతారే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌత్ లో స్టార్ హీరోయిన్ల లిస్టు తయారు చేస్తే అందులో టాప్ 5లో నయనతార పేరు తప్పకుండా ఉంటుంది. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార... ప్రేమ వ్యవహారం కారణంగా ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైంది.

ప్రేమ వ్యవహారం, ప్రభుదేవాతో పెళ్లి చెడివపోడం లాంటి డిస్ట్రబెన్స్ లాంటి వాటి నుండి వెంటనే తేరుకున్న నయనతార.... సినిమాల్లో సెకండ్ ఇన్సింగ్స్‌ మొదలు పెట్టి వరుస అవకాశాలతో మళ్లీ టాప్ పొజిషన్ అందుకుంది.

Nayanthara

అందంతో పాటు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నయనతారకు కోట్లలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు నిర్మాతలు. ముఖ్యంగా తమిళంలో నయనకు ఉన్నంత క్రేజ్ మరే స్టార్ హీరోయిన్ కు లేదు. అందుకే వరుసగా రెండో ఏడాది ఆమె టైమ్స్ 'మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది చెన్నై'గా నిలిచింది.

నయనతార సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె నాలుగు తమిళ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అందులో డోర చిత్రం తెలుగులో కూడా విడుదలకాబోతోంది. 2003లో మళయాల చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన నయనతార....ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుండటం విశేషం.

English summary
Nayanthara declared Most Desirable Woman yet again. According to a poll by Chennai Times the actress has been declared Most Desirable Woman of 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu