ఆయన దర్శకత్వంలో నటించటం లేదు : నయనతార ఖండన
రీసెంట్ గా సుందర్.సి దర్శకత్వంలో నటించనుందన్న వార్తలు కోడంబాక్కంలో షికార్లు చేశాయి. ప్రస్తుతం విశాల్‌తో 'మదగజరాజా' రూపొందిస్తున్న సుందర్.సి. ఆపై సిద్ధార్థతో, అనంతరం 'అరణ్మనై' సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు, ఇందులో నయనతార ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నయనతార మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. 'కొత్త చిత్రానికి సంబంధించి సుందర్.సితోఎలాంటి చర్చలు జరపలేదు. ఆయన దర్శకత్వంలో నటించటం ఓ గౌరవం. ప్రస్తుతానికి చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉన్నాను. సుందర్.సి దర్శకత్వంలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని' తెలిపింది.
మరో ప్రక్క బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నయనతార ప్రకటన చేసింది. ఓప్రముఖ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ నయనతార ఈ విషయాన్ని ధృవీకరించింది.
'బాలీవుడ్ మూవీ కహానీ చిత్రానికి రీమేక్ గా తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రానికి నేను సంతకం చేసారు. ఈచిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ నయనతార చెప్పిన విషయాన్ని చెన్నయ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నయనతార ఈ విషయాన్ని ఇలా అధికారికంగా ప్రకటించడంతో 'కహానీ' చిత్రంపై ఉన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది.


Click it and Unblock the Notifications












