Nayanthara: నయన్ వద్దని చెప్పినా కూడా వినని ప్రియుడు.. ఎంత ఇష్టమో.. వీడియో వైరల్!

సౌత్ ఇండస్ట్రీ లో గత కొన్నేళ్లుగా ఒకే తరహా స్టార్ హోదాతో కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ నయనతార అని చెప్పవచ్చు. ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు వెళ్తున్నారు కానీ లేడీ సూపర్ స్టార్ గా ఆమె ఒకే తరహా ఇమేజ్ తో ముందుకు సాగుతున్నారు. ఇక నయనతార గత కొంత కాలంగా యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతునే ఉంటాయి. ఇక రీసెంట్ గా మరొక వీడియో కూడా నయనతార మరొక వీడియోను షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

అందంతోనే కాకుండా..

అందంతోనే కాకుండా..

2003 నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న నయనతార మలయాళం తెలుగు తమిళం అని తేడా లేకుండా అన్ని భాషలలోనూ నటించే ప్రయత్నం చేసింది. ఇక ఈ బ్యూటీ సీనియర్ హీరోలు జూనియర్ అని లేకుండా అందరితోనూ స్క్రీన్ చేసుకుంటూ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంది. కేవలం అందంతోనే కాకుండా నటనతో కూడా ఈ బ్యూటీ తనను తాను సరికొత్తగా మార్చుకోవడం కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది.

బ్రేకప్స్ తరువాత..

బ్రేకప్స్ తరువాత..

సినిమాలతో ఎంత క్రేజ్ అందుకున్నప్పటికీ కూడా నయనతార తన పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని సార్లు చేదు అనుభవాలను ఎదుర్కొంది. మొదట హీరో శింబుతో కొన్నేళ్ళపాటు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. ఆ రెండు బ్రేకప్స్ తర్వాత నయనతార కాస్త డిప్రెషన్లోకి కూడా వెళ్ళింది.

దర్శకుడితో పెళ్లి

దర్శకుడితో పెళ్లి

అయితే తన పర్సనల్ విషయాలను సినిమా కెరీర్ పై ఏమాత్రం ప్రభావం చూపించకుండా నయనతార చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మంచి సినిమాలు చేసింది. ఇక ఈ క్రమంలో ఆమె యువ దర్శకుడు విగ్నేష్ శివన్ కు బాగా దగ్గరైంది. కొన్ని రోజుల స్నేహంతోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గత రెండేళ్ల నుంచి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

నయన్ హ్యాపీ లైఫ్

నయన్ హ్యాపీ లైఫ్

ఒక విధంగా నయనతార విగ్నేష్ శివన్ తో చాలా సంతోషంగా ఉంది అని అనిపిస్తుంది. షూటింగ్ కు ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కూడా ఇద్దరు విదేశాలకు వెళుతూ హాలిడేస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

రొమాంటిక్ గా గోరు ముద్దలు

ఇక చాలా రోజుల తర్వాత విగ్నేష్ నయనతార కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి భోజనం చేయగా అతను ప్రత్యేకంగా గోరుముద్దలు కూడా తినిపించాడు. ఈ క్రమంలో ఆయన నయన్ పై చేయి వేసి మరి చాలా రొమాంటిక్ గా తినిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట నయన్ వద్దని తల ఊపింది. కానీ అతనిపై ప్రేమకు గోరుముద్దలు తినడానికి ఒప్పుకుంది.

ఎన్నో రకాల వంటకాలు

ఎన్నో రకాల వంటకాలు

టేబుల్ నిండా ఎన్నో రకాల వంటకాలు కనిపిస్తున్నాయి. ఇక అలా పక్కకు తిరిగిన నయనతార విగ్నేష్ ను చూస్తూ ఉండగా.. అతను ప్రత్యేకంగా నయనతారకు అలా తినిపించడం నెటీజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం నయనతార ఐదు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఆమె మరోసారి మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తోంది. విగ్నేష్ శివన్ కూడా తన తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X