twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతారపై తప్పుడు కూతలు... ఈ పార్టీ సస్పెండ్ చేయడంతో ఆ పార్టీలోకి!

    |

    ప్రముఖ తమిళ సీనియర్ నటుడు రాధా రవి తరచూ వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటి నయనతారపై తప్పుడు కూతలు కూయడంతో.... ఎంకె స్టాలిన్ నాయకత్వంలోని 'డిఎంకె' పార్టీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

    'డిఎంకె' పార్టీ తనపై తీసుకున్న చర్య కారణంగా రాధా రావి పార్టీ వీడారు. ప్రత్యర్థి పార్టీ 'అన్నాడీఎంకె'లో చేరారు. ఈ మేరకు జూన్ 12న రాధారవి తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

    Nayanthara effect: Radha Ravi joins DMK for slut-shaming

    గతంలో రాధా రవి 'అన్నా డీఎంకె'లోనే ఉండేవారు. 2002లో సైదాపేట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ గెలుపొందారు. అయితే 2006లో అతడికి టిక్కెట్ లభించలేదు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2010లో పార్టీని వీడారు. జయలలిత మరణం తర్వాత రాధా రవి 'డిఎంకె' తీర్థం పెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే పార్టీ కేవలం డిఎంకె మాత్రమే అని, ఈ రాష్ట్రాన్ని పాలించే ధీటైన నాయకుడు స్టాలిన్ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

    అయితే ఓ ఆడియో వేడుకలో నయనతారపై చేసిన వివాదాస్పద కామెంట్లకు రాధారవి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నయనతార లాంటి వారు సీత పాత్ర చేయడానకి ఏ మాత్రం అర్హురాలు కాదు అనే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై నయనతార తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ 'డిఎంకె' నిర్ణయం తీసుకుంది.

    English summary
    Radha Ravi, who was suspended from the DMK for slut-shaming Nayanthara, has now joined the AIADMK.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X