ప్రభుదేవాతో పెళ్లి వ్యవహారంతో నయనతారకు కొత్త కష్టాలు
ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న నటి నయనతారకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుదేవా భార్య రమాలత్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్లు వేసి ఓ వైపు పెళ్లికి ఆటంకాలు కల్పిస్తుండగా, మరో వైపు తమిళనాడులో నయనతారను మహిళా సంఘాలు టార్గెట్ చేసుకుంటున్నాయి. నయనతారకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ సంస్థలు ప్రభుదేవాను వదిలేస్తాయి. ఇది నయనతారకు చిరాగ్గా ఉంది. మహిళా సంఘాల కార్యకర్తలు నయనతార సినిమా పోస్టర్లను చించేసి తగులబెడుతున్నారు. ప్రభుదేవాను వదిలేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్లు నయనతారను హెచ్చరిస్తున్నారు. సెలిబ్రిటీని, అందునా హీరోయిన్ ను టార్గెట్ చేసుకుంటే ప్రచారం ఎక్కువ లభిస్తుందని ఆ సంస్థల ఉద్దేశం కూడా కావచ్చు. తన భార్య రమాలత్ పై కౌంటర్ కేసు వేసి విడాకులు తీసుకుంటానని, విడాకులు తీసుకోగానే నయనతారను పెళ్లి చేసుకుంటానని ప్రభుదేవా హామీ ఇస్తున్నాడు. అయితే, విడాకులకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు.


Click it and Unblock the Notifications











