సెట్లో నయనతారకు అవమానం..షాక్
కురచ దుస్తుల్లో వచ్చిన ఆమెను చూసి ఉదయనిధి ఒక్కసారిగా కోపాన్ని ప్రదర్శించాడట. 'సినిమాలో అయితే తప్పనిసరి. బయటకూడా ఇలాంటి దుస్తులతోనే రావాలా? చిత్రీకరణ మొదలయ్యే లోపు డ్రస్ మార్చుకురమ్మ'ని చివాట్లు పెట్టాడట. ఇది ఎంతమాత్రని వూహించని నయనతార షాక్‌కు గురైందట. చిత్రబృందం ఎదుట అవమానం జరిగిందే అంటూ తెగ బాధపడిపోయిందట.
మరో ప్రక్క నయనతార బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు/తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని పాతబస్తీలో సాగుతోంది. ఇందులో ఆమె 'అనామిక' పాత్రలో కనిపించనుంది.
ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications












