ప్రభుదేవాపై కసి తీర్చుకొన్న నయనతార.. ఇన్నాళ్లకు ఏం చేసిందో తెలుసా?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రభుదేవా, నయనతార సహజీవనం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నయనతారతో లివింగ్ రిలేషన్ షిప్‌తో ఏకంగా భార్య రమాలత్‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తీరా పెళ్లి చేసుకొంటారనుకొనే సమయంలో ప్రభుదేవా, నయనతార విడిపోవడం మరో సంచలనానికి కారణమైంది. అయితే అప్పటి ప్రభు జ్ఞాపకాలను ఇటీవల చెరిపేయడంతో ప్రభుదేవాతో సహజీవనం మరోసారి మీడియాలో హైలెట్ అయింది. నయనతార తాజాగా చేసిన పనేమిటంటే..

ప్రభుదేవాతో సహజీవనం

ప్రభుదేవాతో సహజీవనం

2009 నుంచి 2012 వరకు నయనతార, ప్రభుదేవ మధ్య అఫైర్ రంజుగా సాగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు చిలకా గోరింకల్లా ప్రేమాయణాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ప్రభుదేవాపై ప్రేమకు చిహ్నంగా తన ఎడమ చేతిపై ప్రభు అనే పచ్చబొట్టును వేయించుకొన్నది. అయితే అనూహ్య రీతిలో వారి ప్రేమాయణం బ్రేకప్ కావడం పచ్చబొట్టు అలానే మిగిలిపోవడం జరిగింది.

నా వంతు 100 శాతం ప్రయత్నం

నా వంతు 100 శాతం ప్రయత్నం

ప్రభుదేవాతో అఫైర్ సమయంలో తన బంధాన్ని నిలబెట్టుకోవడానికి తన వంతుగా చాలా ప్రయత్నం చేశాను. విధిరాతను ఎవరూ తప్పించలేరు. నేను 100 శాతం ప్రేమను చూపించినా మా బంధం నిలబడలేకపోయింది. మా బంధం తెగిపోవడానికి కారణం నేను కాదు. ప్రభుదేవా వల్లనే మా రిలేషన్ ముందుకు వెళ్లలేదనే కసి ఆమె మాటల్లో కనిపించింది.

ప్రభు పేరుతో పచ్చబొట్టు

ప్రభు పేరుతో పచ్చబొట్టు

అయితే ఎడమ చేతిపై ఉన్న ప్రభు పచ్చబొట్టు నయనకు చాలా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దర్శక, నిర్మాత విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉండటం కారణంగా ప్రభు పేరు పాత జ్ఞాపకాలను వెంటాడేలా చేస్తున్నది. దాంతో ప్రభు పేరుతో పచ్చబొట్టును టాటూ) తొలగించుకోవాలనే ప్రయత్నాలు చేసింది.

సర్జరీతో తొలగించి పాజిటివిటి

సర్జరీతో తొలగించి పాజిటివిటి

నయనతార తన ఎడమచేతిపై ఉన్న ప్రభు అనే అక్షరాలను సర్జరీ ద్వారా ఇటీవల తొలగించుకొన్నది. ఆ స్థానంలో పాజిటివిటీ అనే టాటూను పొడిపించుకొన్నది. విఘ్నేష్ శివన్‌తో ప్రేమ సానుకూలంగా ఉండటం కారణంగా పాజిటివిటి అనే టాటూను వేసుకొన్నదనే మాట సినీ వర్గాల్లో వినిపించింది. ఇటీవల తన కొత్త టాటూకు సంబంధించిన ఫోటోను విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశారు.

Recommended Video

Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
నయనతార కెరీర్ గ్రాఫ్

నయనతార కెరీర్ గ్రాఫ్

ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్తున్నారు. లేడి సూపర్‌స్టార్ ట్యాగ్‌ను సొంత చేసుకొని సోల్ హిట్లు సాధిస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌తో దర్బార్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కాథు వాకులా రెండు కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత అక్కినేని కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X