విఘ్నేష్‌తో ఉన్నా ప్రభుదేవా జ్ఞాపకాలే: సంచలనంగా నయనతార కామెంట్స్
సౌత్ ఇండియాలోని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతోంది టాలెంటెడ్ హీరోయిన్ నయనతార. భాషతో సంబంధం లేకుండా ఆమె వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి నటిస్తూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తోంది.
అదే సమయంలో తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కగా నడిపించుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన భర్త విఘ్నేష్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఆమె పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వివరాలు మీకోసమే!

బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లింది: ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోన్న నయనతార.. గత ఏడాది షారూక్ ఖాన్‌తో కలిసి 'జవాన్' అనే సినిమాను చేసింది. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అయింది. దీంతో నయనతార రేంజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు మరింతగా వస్తున్నాయి.

భర్తతో కలిసి ఫుల్ హల్చల్: నయన్.. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం జరిగిన చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిన ఈ సినీ జంట.. ఖాళీ సమయాల్లో తమ వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ విహార యాత్రకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటితో ఫుల్‌గా హల్చల్ చేస్తున్నారు.

భర్తను అన్‌ఫాలో అవుతూ: కొంత కాలం క్రితమే లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను ఓపెన్ చేసింది. అప్పటి నుంచి అందులో తన భర్త, పిల్లల గురించి కూడా తరచూ పోస్టులు చేస్తోంది. ఉన్నట్లుండి ఏమైందో కానీ విఘ్నేష్ శివన్‌ను నయనతార అందులో అన్‌ఫాలో అయింది. దీంతో ఈ సినీ జంట మధ్యన అసలేం జరిగిందో తెలియక ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

విడిపోతున్నారని.. ఫొటో: విఘ్నేష్ శివన్‌ను నయనతార ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అన్‌ఫాలో అవడంతో వీళ్లిద్దరి మధ్యన విభేదాలు వచ్చాయని, ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, డివోర్స్‌పై ప్రకటన కూడా రాబోతుందని కొందరు అన్నారు. ఈ పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ తన భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. తద్వారా ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు.
పాత వీడియో వైరల్ చేసి: భర్త విఘ్నేష్‌ను నయనతార అన్‌ఫాలో అవడంతో ఆమెను వ్యతిరేకించే ఓ వర్గం పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. మరీ ముఖ్యంగా గతంలో ఆమె మాజీ ప్రియుడు ప్రభుదేవాపై చేసిన కామెంట్లను కూడా హైలైట్ చేస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇలా చాలా ఏళ్ల క్రితమే ప్రభుదేవా గురించి నయనతార అన్న కొన్ని మాటలు వైరల్ అవుతోన్నాయి.

ప్రభుదేవా జ్ఞాపకాలే అని: గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా గురించి నయనతార.. 'ఆయనతో విడిపోయిన తర్వాత నా మనసు ముక్కలైంది. ఆ సమయంలో ఒంటరిగా ఎంతో కుమిలిపోయా. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతేందుకు విఘ్నేష్‌తో ఉన్నా ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కామెంట్లనే ఇప్పుడు కొందరు హైలైట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











