నయనతార పెళ్ళికి అక్కడ ఏర్పాట్లు
ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ప్రభుదేవా,నయనతారల వివాహం త్వరలోనే ముంబైలో జరగనుంది.అందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ అక్కడ చకచకా జరుగుతున్నట్లు సమాచారం.తమిళంలో ప్రభుదేవా దర్శకత్వంలో జయం రవి,హన్సిక జంటగా రూపొందిన చిత్రం దాదాపు పూర్తయ్యింది. దీంతో ఆయన వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తమిళ సినీ వర్గాలు తెలిపాయి.ఇక ఇంత అర్జెంటుగా నిర్ణయం తీసుకోవటానికి కారణం నయనతార ఒత్తిడి తేవడమేనని అంటున్నారు.నిజానికి నయనతార గత కొద్ది రోజులుగా ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.
ఆమె ఎక్కడ కనిపించినా జనం,మీడియావారు ఆమెకు,ప్రభుదేవాకు పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు.దాంతో వారికి సమాధానం చెప్పలేక నయనతార ముఖం చాటేస్తుంది.మరో ప్రక్క ప్రభుదేవా కూడా నయనతారతో తన పెళ్లి గురించి ఇప్పుడు ఎక్కడా నోరుమెదపడంలేదు.దాంతో నయనతార పరిస్ధితి అయోమయంలో పడిపోయింది.దాంతో ప్రభుదేవాపై ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'శ్రీరామరాజ్యం" చిత్రంలో నటిస్తూ బిజీగా వుంది. అలాగే ప్రభుదేవా తమిళంలో విశాల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











