ప్రియుడితో కౌగిలింతలు.. ఫుల్ రొమాన్స్‌తో నయనతార.. ఫొటోలు వైరల్
అందాల భామ నయనతార, డైరెక్టర్, నిర్మాత విగ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిలకా గోరింకల్లా చెట్టాపట్టాలేసుకొని వారు విహరిస్తున్న తీరు చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. గతంలో ఎన్నోసార్లు తమ రొమాంటిక్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకొన్న ఈ జంట తాజాగా మరోసారి హల్‌చల్ చేశారు. ఇటీవల కాలంలో వారిద్దరూ చేసిన హంగామా ఏమిటో ఓ సారి చూద్దాం..

విఘ్నేష్ శివన్‌తో సహజీవనం
గతంలో రెండు మూడు బ్రేకప్‌ల నుంచి బయటపడిన నయనతార కొద్ది సంవత్సరాలుగా విఘ్నేష్ శివన్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే వారిద్దరూ అధికారికంగా తమ బంధాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి వారిద్దరు ఓ సందర్బం చిక్కితే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆ ఫీలింగ్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటున్నారు.

ఓనమ్ పండుగ సమయంలో
లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన నయనతార, విఘ్నేష్ శివన్ ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. లాక్‌డౌన్ తర్వాత ప్రత్యేక విమానంలో కేరళలోని తన సొంత ఇంటికి నయనతార చేరుకొన్నారు. ఆ సందర్భంగా ఓనమ్ పండుగను కొత్త పెళ్లి జంటగా ఆస్వాదించారు.

ఈస్టర్ పండుగ రోజున క్రేజీగా
తాజాగా ఈస్టర్ పండుగ సందర్భంగా పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ కౌగిలింతలతో చిలిపిగా కనిపించారు. వారిద్దరు దిగిన ఫోటోను నయనతార ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయింది. ఈస్టర్ డే.. నా జీవితంలో సంతోషకరమైన దినం అంటూ కామెంట్ చేశారు..

నయనతార కెరీర్ ఇలా
నయనతార కెరీర్ విషయానికి వస్తే మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే నెట్రికన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తునన చిత్రం కథువాకుల రెండు కాదల్ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంతతో కలిసి నటిస్తున్నారు. అలాగే లూసిఫర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











