నయనతార వెంటపడిన అభిమాని.. మొత్తం ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఘోరంగా.. చివరికి ఏమైందంటే?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది బ్యూటిఫుల్ నయనతార. సుమారు 17 ఏళ్ల పాటు సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న నయనతార తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతోంది. త్వరలో జవాన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

ఇటీవల తన ట్విన్ బేబీ బాయ్స్ పేరేంటో తెలిపిన నయనతారకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె వెంటే ఫాలో అవుతూ ఒక అభిమాని ఘోరంగా ప్రవర్తించాడు. దీంతో నయన్ విసిగిపోయింది. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Nayanthara Serious Warning To Fan Over Recording In Mobile At Railway Station

అలా సినిమాల్లోకి: కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ ప్రారంభించిన మలయాళ కుట్టి నయనతార 'మనస్సినక్కరే' సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. విభిన్నమైన సినిమాల్లో అలరించిన ఈ బ్యూటిఫుల్ సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. దాదాపుగా 17 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో వెలుగొందుతోన్న నయనతార మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది.

హిట్లు.. ఫ్లాపులు: గతేడాది ఖతీజా రాంబో కణ్మణి, ఓ2, కనెక్ట్ వంటి చిత్రాలతో పలకరించింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఖతీజా రాంబో కణ్మణి థియేటర్లలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓ2, కనెక్ట్ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇందులో ఓ2 పర్వాలేదనిపించుకున్న కనెక్ట్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్ మూవీతో హిందీలోకి తెరంగేట్రం చేయనుంది.

Nayanthara Serious Warning To Fan Over Recording In Mobile At Railway Station

పిల్లలకు పేర్లు: ఇక నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ దంపతులకు ఇద్దరు ట్విన్ బేబీ బాయ్స్ జన్మించారు. నయన తార సరోగసీ ద్వారా పిల్లల్ని కనడంపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. నయన్ తన పిల్లలిద్దరికి ఉయిర్, ఉలగ్ అని పేర్లు పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

భద్రత ఏర్పాట్లు: ఇదిలా ఉంటే తాజాగా ఈ లేడీ సూపర్ స్టార్ నయనతారకు చేదు అనుభవం ఎదురైంది. పిల్లలకు పేర్లు పెట్టిన తర్వాత నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి తంజావూరు జిల్లా అయ్యంపేట, కుంభకోణం సమీపంలో ఉన్న కామాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించారు. నయనతార వస్తున్న విషయం తెలిసిన స్థానికులు, అభిమానులు, జనం పెద్దగా గుమిగూడారు. ముందస్తుగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు వాళ్లను ఆపడం చాలా కష్టమైంది.

Nayanthara Serious Warning To Fan Over Recording In Mobile At Railway Station

రైల్వే స్టేషన్ లో: స్వయంగా విఘ్నేష్ శివన్ బయటకు వచ్చి రిక్వెస్ట్ చేసినా ఫలితం దక్కలేదు. ఇక పరిస్థితి చేయి దాటి పోవడంతో చేసేది లేక త్వరగా పూజ ముగించుకొని గుడి నుంచి వెళ్లిపోయారు నయన్, విఘ్నేష్. తిరుగు ప్రయాణంలో ట్రైన్ లో వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు ఈ దంపతులు. అయితే నయనతారను చూసేందుకు అభిమానులు అక్కడ కూడా ఎగబడ్డారు.

భంగం కలగడంతో: ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ లో ఒక అభిమాని నయనతారను ఫాలో అవుతూ మొత్తం తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ కనిపించాడు. అప్పటికే విసుగు చెందిన నయనతార ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చింది. రికార్డింగ్ ఆపేయాలని, లేకుంటే ఫోన్ పగులగొడతానని హెచ్చరించింది. ఇలా తనకు ప్రైవేట్ లైఫ్ కు భంగం కలిగించిన వారిపై అసహనం వ్యక్తం చేసింది నయనతార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X