సూర్యతో నయనతార రొమాన్స్.. నాలుగోసారి అదరగొట్టే కెమిస్ట్రీతో..

దక్షిణాదిలో వరుస విజయాలు, సినిమాలతో నయనతార తన సత్తా చాటుతున్నారు. లేడీ సూపర్‌స్టార్ అనే ట్యాగ్‌ను అందుకొని అగ్రహీరోల చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తున్నది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో దర్బార్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకొన్నది.

క్రేజీ హీరో సూర్యతో విశ్వాసం దర్శకుడు సిరుతై శివ రూపొందించే చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారనే వార్త తమిళ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇటీవల దర్శకుడు శివ చెప్పిన కథ నయనతారకు నచ్చడం.. అందులో నటించడానికి ఆమె సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Nayanthara set to work with Siruthai Siva and suriya again

గతంలో సూర్యతో గజిని, ఆధావన్, మాసు ఎంగీరా మాసిలామని (మాస్) అనే చిత్రాల్లో నయనతార కలిసి నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి ఆదరణ లభించింది. తాజాగా నాలుగోసారి జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

నయనతార చేతినిండ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. విజయ్ 63 చిత్రంతోపాటు దర్బార్‌లో నటిస్తున్నది. విజయ్ చిత్రం చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా, రజనీ దర్బార్ ముంబైలో మొదలైంది. అంతేకాకుండా చిరంజీవి‌తో సైరా నర్సింహారెడ్డి, హీరో శివకార్తీకేయన్‌తో మిస్టర్ లోకల్ నటిస్తున్నది.

హీరో సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ రూపొందిస్తున్న ఎన్‌జీకే, కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న కాప్పాన్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే గురు ఫేం సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న సూరరై పొట్రు చిత్రం షూటింగ్‌లో సూర్య బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X