నయనతార కమిటైన కొత్త చిత్రం వివరాలు
ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ "నేను నయనతారకు ఓ కథ నేరేట్ చేసాను. వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెకు కథ బాగా నచ్చిందని చెప్పింది. ఆమె పాత్ర చిత్రంలో చాలా క్యూట్ గా సాగుతుంది. ఆమె డేట్స్ ని బట్టి మా చిత్రం ప్రారంభం అవుతుంది. ఆమె మాకు సినిమా చేస్తున్నట్లు డేట్స్ ఎలాట్ చేస్తూ రెండు రోజుల క్రితం అఫీషియల్ గా తెలియచేసారు." అన్నాడు. చిత్రం పూర్తి కామెడీగా సిటీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని చెప్పారు.
నయనతార ప్రస్తుతం కృష్ణం వందే జగద్గురుమ్..చిత్రం చేస్తోంది. ఈ సినిమా గురించి ఆమె చెపుతూ...కథలో నాది చాలా కీలకమైన పాత్ర. కథానాయిక అంటే.. పాటలకే పరిమితం కాకూడదు. అంతో ఇంతో ప్రాముఖ్యం ఉంటేనే గుర్తింపు. ఈ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ కూడా చెప్పుకొన్నా. నటిగా పరిపూర్ణమైన సంతృప్తి అందించిన సినిమా ఇది అందామె.
ప్రస్తుతం తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రం చేస్తోంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకుడు. పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో రానా సరసన కృష్ణం వందే జగద్గురుం చిత్రంలోనూ నాగార్జునతో లవ్‌స్టోరీ చిత్రంలోనూ నటిస్తోంది. కృష్ణం వందే జగద్గురుం చిత్రం విడుదలకు ముస్తాబవుతుండగా మాతృభాష మల యాళంలో ఒక చిత్రాన్ని ఒప్పుకుంది.


Click it and Unblock the Notifications












