ఆహార కల్తీ, అవినీతి వ్యవస్థపై పోరాటం.. వేలైక్కరన్..
ఆహార కల్తీ, అవినీతి వ్యవస్థపై మురికివాడలు, మెడికల్ మాఫియాపై ప్రజలు సాగించిన పోరాటమే వేలైక్కరన్ చిత్ర కథ. ఈ చిత్రాన్ని అణగారిన ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న వేలైక్కరన్ చిత్రంలో నయనతార, స్నేహ, ప్రకాశ్ రాజ్, ఆర్జే బాలాజీ, సతీష్, రోహిణి తదితరలు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రాన్ని 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా నిర్మించారు.


Click it and Unblock the Notifications











