'కరాటే' నేర్చుకుంటున్న నయనతార...ఎందుకంటే

By Srikanya

Nayanthara
చెన్నై : నయనతార తన కొత్త చిత్రం కోసం 'కరాటే' నేర్చుకునే పనిలో పడింది.ఇటీవల జయంరవికి జంటగా నటించేందుకు ఎంపికైంది. ఇందులో ఆమె యాక్షన్‌ పాత్రలో.. అంటే కరాటే మాస్టర్‌గా దర్శనమివ్వనుంది. హీరోకు దీటైన పాత్ర కావటంతో రక్తి కట్టించేందుకు ప్రస్తుతం కరాటేలో శిక్షణ తీసుకుంటోంది. అందుకోసం ప్రత్యేకమైన ట్యూటర్ ని పెట్టుకుని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు వరకూ ఇదే పనిలో ఉంటోందని సమాచారం.

నయనతార ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో జోరుమీదుంది. ఇటీవల 'ఆరంభం' సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించిన నయన్ తాజాగా కరాటే మాస్టర్ అవతారం ఎత్తనుంది. జయం రవి హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జయం రవికి జోడీ కడుతోంది. జయం రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నయనతార కొన్ని కరాటే ఫీట్స్‌ను నేర్చుకుంటోంది. కొన్ని సన్నివేశాల్లో పోలీస్ యూనిఫార్మ్‌లోనూ ఫైట్లు చేయనుందట నయనతార.

తమిళ,తెలుగు భాషల్లో అగ్రస్థానంలో కొనసాగిన నయన్‌... తన వ్యక్తిగత కారణాలతో ఈ రంగానికి దూరం కావాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ మనసు మార్చుకున్న ఆమె ముఖానికి రంగేసుకునేందుకు నిశ్చయించుకుంది. ఆశ్చర్యకరంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆమెకు చక్కని అవకాశాలు వచ్చాయి. 'రాజారాణి', 'ఆరంభం' చిత్రాలు ఘన విజయం సాధించి ఆమెకు మరింత పేరు తెచ్చాయి. ఇప్పుడీ కొత్త చిత్రంతో తానేంటో మరోసారి చూపించుకునే అవకాసం ఉంటుందని భావిస్తోంది. అన్నట్టు ఈ భామ తెలుగులో 'రాధ', 'అనామిక' చిత్రాల్లో నటిస్తోంది.

ఇక నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి పలు రిలీజ్ డేట్స్ అనుకున్నారు కానీ ఫైనల్ గా ఈ చిత్రాన్ని పిభ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి నిర్ణియించుకున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X