Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనతార అందుకే లేడి సూపర్ స్టార్.. చిత్ర యూనిట్ కోసం స్పెషల్ గిఫ్ట్!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా అందాల తార నయనతార దూసుకుపోతోంది. నయనతార క్రేజ్ ప్రస్తుతం ఎలా ఉందంటే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా స్టార్ హీరోల రేంజ్ లో సినిమాలు ఆడుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోందంటే అందులో హీరోయిన్ గా దర్శక నిర్మాతలు మొదటి ప్రాధాన్యత నయనతారకే ఇస్తున్నారు. ఈ ఏడాది అజిత్ సరసన నటించిన విశ్వాసం చిత్రంలో నటించిన నయన్ విజయాన్ని అందుకుంది. మరి కొన్ని చిత్రాలలో నటిస్తోంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, నయనతార జంటగా మిస్టర్ లోకల్ చిత్రంలో నటిస్తున్నారు.తన భాగం షూటింగ్ పూర్తి కావడంతో నయనతార చిత్ర యూనిట్ కు ప్రత్యేకమైన గిఫ్ట్ లతో ఆశ్చర్యపరిచింది.
వినోదాత్మక చిత్రం
ఓకె ఓకె ఫేమ్ రాజేష్ దర్శకత్వంలో మిస్టర్ లోకల్ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నయనతార భాగానికి సంబందించిన షూటింగ్ పూర్తయింది. నయనతార, శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. వీళ్ళిద్దరూ 2017లో విడుదలైన వేలైక్కారన్ చిత్రంలో నటించారు. మిస్టర్ లోకల్ షూటింగ్ పూర్తి కావడంతో నయనతార ప్రత్యేకమైన గిఫ్ట్ లని చిత్ర యూనిట్ కి అందించింది.
లేడి సూపర్ స్టార్
ఫాసిల్ కంపెనీ వాచ్ లని నయనతార చిత్ర యూనిట్ మొత్తానికి అందించింది. దీనితో నయనతార స్నేహ స్వభావం, మంచి తనం మరోమారు బయట పడిందని చిత్ర యూనిట్ ఆమెని ప్రశంసించారు. సెట్స్ లో నయనతార ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటుందట. అందుకే ఆమె లేడి సూపర్ స్టార్ గా ఎదిగిందని అంటున్నారు. షూటింగ్ చివరిరోజు చిత్ర యూనిట్ నయనతార సమక్షంలో కేక్ కట్ చేసే చిన్నపాటి సంబరాలు చేసుకున్నారు.
చేతిలో క్రేజీ చిత్రాలు
ప్రస్తుతం నయనతార చేతిలో క్రేజీ చిత్రాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డిలో నయనతారే హీరోయిన్. మరికొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇళయదళపతి విజయ్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నయనతారనే హీరోయిన్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
నయనతార, హన్సిక బ్రేకప్స్ కంటే.. ‘కావేరి' విషయంతో శింబు కంటతడి.. గుండె పగిలింది!
అత్యధిక పారితోషికం
సౌత్‌లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతారనే. నయనతార క్రేజ్ చూసి ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి అయినా తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కొరటాల శివ, చిరంజీవి చిత్రంలో కూడా హీరోయిన్ గా నయనతార పేరు వినిపిస్తోంది. ఇక మిస్టర్ లోకల్ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.