Nayanatara: స్టార్ హీరోతో నయనతార... ఆ పాత గొడవలన్నీ సద్దుమణిగినట్టేనా?
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నయనతార నటించబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే నయనతార పాత గొడవలన్నీ మర్చిపోయి అజిత్ తో సినిమా చేయడానికి ఒప్పుకుందా? అని అడుగుతున్నారు నెటిజెన్లు. అసలు అజిత్, నయన్ మధ్య జరిగిన గొడవ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం అజిత్ చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విడాముయార్చి అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్.లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి దశ షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియ రాలేదు.ఈ నేపథ్యంలోనే అజిత్ తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టేసాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను చేస్తున్నాడు అజిత్.

ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హైదరాబాదులో ఇప్పటికే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ లో నయన్ పాల్గొన్నని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దీంతో గతంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు, సమస్యలు తీరినట్టేనా? అనే అనుమానాలు నెలకొన్నాయి. నయనతార గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తుందన్న వార్త నేపథ్యంలో అజిత్ పై ఆమె కోపం తగ్గిందా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో అజిత్ తన 62వ సినిమాను మొదట విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.

దీంతో అప్పట్లో అజిత్ పై నయనతార కోపంగా ఉందని వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు నయనతార అజిత్ తో సినిమా చేస్తోంది. అనగానే ఆ గొడవలన్నీ చల్లబడ్డట్టేనా అని అడుగుతున్నారు. ఒకవేళ నయనతార నిజంగానే అజిత్ సినిమాలో నటిస్తుంటే ఆ పాత విషయాలన్నింటిని పక్కన పెట్టేసినట్టే. ఇందులో శ్రీలీల కూడా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ఆయన నెక్స్ట్ మూవీని కూడా లైన్లో పెట్టేశారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 62వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అజిత్. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన తునివు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతోంది అనే వార్తలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.


Click it and Unblock the Notifications











